WHO Report: విజృంభిస్తున్న మంకీఫాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 70వేలకు పైగా కేసులు.. 26 మరణాలు..

ఓవైపు కరోనా, దాని వేరియంట్స్.. మరోవైపు సూపర్ బగ్స్, ఇంకో వైపు మంకీఫాక్స్.. ఇలా ప్రజలపై ముప్పేట దాడి చేస్తున్నాయి వైరస్‌లు. ఈ ప్రాణాంతక వైరస్‌ల కారణంగా జనాలు బిక్కు బిక్కుమంటూ

WHO Report: విజృంభిస్తున్న మంకీఫాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 70వేలకు పైగా కేసులు.. 26 మరణాలు..
Who
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 15, 2022 | 1:27 PM

ఓవైపు కరోనా, దాని వేరియంట్స్.. మరోవైపు సూపర్ బగ్స్, ఇంకో వైపు మంకీఫాక్స్.. ఇలా ప్రజలపై ముప్పేట దాడి చేస్తున్నాయి వైరస్‌లు. ఈ ప్రాణాంతక వైరస్‌ల కారణంగా జనాలు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఓవైపు కరోనా మళ్లీ అటాక్ చేస్తుండగా.. మరోవైపు మంకీపాక్స్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మంకీపాక్స్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70 వేలు దాటాయని ప్రకటించింది. మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్. ప్రజలు తగు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

టెడ్రోస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంకీపాక్స్ కేసులు 70వేలకు పైగా నమోదు అయ్యాయి. అదే సమయంలో మంకీపాక్స్ కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కేసులు తగ్గుతున్నప్పటికీ.. గత వారం రోజుల్లో 21 దేశాల్లో కేసులు పెరిగినట్లు గుర్తించామన్నారు. గతవారం రోజుల్లో నమోదైన కేసులలో దాదాపు 90 శాతం కేసులు అమెరికాలోనే నమోదైనట్లు టెడ్రోస్ వెల్లడించారు. మంకీపాక్స్ వ్యాప్తి ప్రస్తుతానికి నెమ్మదించినప్పటికీ.. నమ్మడానికి వీలులేదన్నారు. సంక్షోభం ముగిసిందనడానికి అవకాశం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ.

ఇక సూడాన్‌లో, ముఖ్యంగా ఇథియోపియన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న శరణార్థి శిబిరాల్లో మంకీపాక్స్ కేసులకు సంబంధించిన నివేదికపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ 19 మాదిరిగానే మంకీపాక్స్ విషయంలోనూ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఉందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలో పరిస్థితి దారుణం..

మే నెల నుంచి ప్రపంచ దేశాలలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. తొలుత ఆఫ్రికన్ దేశాలలో మాత్రమే కనిపించిన మంకీపాక్స్.. క్రమంగా విదేశాలకూ వ్యాపించడం ప్రారంభమైంది. మే నెల ప్రారంభం నుంచి అమెరికాలో మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమెరికాలో 42 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అవ్వగా, ఐరోపాలో 25 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..