AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi US Visit: ప్రధాని మోడీ ఏడేళ్ళలో ముగ్గురు అమెరికా అధ్యక్షులతో సమావేశం.. బైడెన్‌ తో భేటీలో ఏం జరగనుంది?

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని కలవనున్నారు. బైడెన్ జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత, ఇద్దరు నాయకులు ముఖాముఖి కూర్చుని మాట్లాడటం ఇదే మొదటిసారి.

Modi US Visit: ప్రధాని మోడీ ఏడేళ్ళలో ముగ్గురు అమెరికా అధ్యక్షులతో సమావేశం.. బైడెన్‌ తో భేటీలో ఏం జరగనుంది?
Modi Us Visit
KVD Varma
|

Updated on: Sep 24, 2021 | 2:27 PM

Share

Modi US Visit: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని కలవనున్నారు. బైడెన్ జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తరువాత, ఇద్దరు నాయకులు ముఖాముఖి కూర్చుని మాట్లాడటం ఇదే మొదటిసారి. రెండు దేశాలకు ఉమ్మడి సవాళ్లు ఉన్నాయి. రెండు దేశాలలో కోవిడ్ వినాశనం పూర్తిగా ఆగలేదు. వేగంగా టీకాలు వేయడం ఒక సవాలు. ఆఫ్ఘనిస్తాన్ నుండి తాజాగా భాగస్వామ్య సవాలు ఉద్భవిస్తోంది. ఈ విషయంలో బైడెన్, మోడీ మధ్యలో ఎటువంటి చర్చ జరుగుతుందో.. దాని విషయంలో రెండు దేశాల వైఖరి మధ్య ఏకాభిప్రాయం దొరుకుతుందో లేదో తేలాల్సి ఉంది.

నిజానికి మొదటి షెడ్యూల్‌లో ఈ భేటీ లేదు..

మోదీ అమెరికా పర్యటన నిర్ణయం అయినపుడు.. ఆయన బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపాలని మొదట నిర్ణయించలేదు. చాలా రోజుల తరువాత, వైట్ హౌస్ ఈ ఇద్దరి మధ్య ముఖాముఖి చర్చలను ఆమోదించింది. వైట్ హౌస్ వద్ద ప్రెసిడెంట్ బైడెన్ ప్రధాని మోడీని కలుస్తారని చెప్పారు. తరువాత దీనిని బైడెన్ వారపు షెడ్యూల్‌లో చేర్చారు. ఆ తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సమావేశాన్ని ధృవీకరించారు.

భారతదేశం ప్రాముఖ్యత

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లినప్పటికీ, మనం ఆయన షెడ్యూల్‌ని నిశితంగా పరిశీలిస్తే, ఈ పర్యటన దౌత్యపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. దీనిని మూడు పాయింట్లలో అర్థం చేసుకోవచ్చు.

క్వాడ్‌లో నాలుగు దేశాలు ఉన్నాయి. భారతదేశం, USA, ఆస్ట్రేలియా, జపాన్. ఈ నాలుగు దేశాలకు సవాలు.. ముప్పు ఏదైనా ఉందీ అంటే అది నేరుగా చైనా నుండి. అందువల్ల, నాలుగు దేశాల దేశాధినేతలు వర్చువల్ సమావేశానికి బదులుగా భౌతికంగా వాషింగ్టన్ చేరుకున్నారు. బైడెన్.. కమలా హారిస్ ఇద్దరూ క్వాడ్ దేశాల నాయకులను కలవాల్సి ఉంది. భారతదేశం, పసిఫిక్ మహాసముద్రంలో ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి చైనా ప్రయత్నిస్తోందని, చిన్న దేశాలను బెదిరించడం ద్వారా, అది నేరుగా ఎదురుదాడి చేస్తోందనీ స్పష్టమవుతోంది. మోడీ గతంలో ఇద్దరు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, డోనాల్డ్ ట్రంప్‌తో పనిచేశారు. బైడెన్ పరిపాలన ఇప్పటివరకు భారతదేశం పట్ల రిపబ్లికన్ ట్రంప్ వైఖరినే తీసుకుంది. ఇటీవల, వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో రిపబ్లికన్లు.. డెమొక్రాట్లు భారతదేశానికి సంబంధించి ఒకే వైఖరిని కలిగి ఉన్నారని వెల్లడించింది.

చైనా-పాకిస్తాన్ ఆసక్తి..

మోడీ, బైడెన్ భేటీలో ఏమి జరుగుతుందో, ఏమి చెబుతారో అనే అంశంపై చైనా అలాగే, పాకిస్తాన్ ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ పెద్ద పాత్ర పోషించాలని అమెరికా కోరుకుంటోంది. అయితే, ప్రస్తుతానికి ఇది సాధ్యం కాదు, ఎందుకంటే దీని కోసం ముందుగా తాలిబాన్ పాలనను అంగీకరించాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశమూ దానిని గుర్తించలేదు.

చైనా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సహజ వనరులు, గనుల మీద దృష్టి పెట్టాయి. ఇక ఇక్కడ ఉన్న అతి పెద్ద ప్రమాదం డ్రగ్స్ వ్యాపారం. దీని విషయంలో ప్రపంచం ఆందోళన చెందుతోంది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌కు ఇచ్చే అన్ని నిధులను అమెరికా స్తంభింపజేసింది. అయితే, ఈ రెండు దేశాలు కూడా ప్రపంచ ప్రతిచర్యకు భయపడుతున్నాయి. చైనా, పాకిస్తాన్ ఎక్కువగా మాట్లాడటానికి కారణం ఇదే. కానీ తాలిబాన్లను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా లేదు.

ఇవి కూడా చదవండి: 

Modi US Visit: పీఎం నరేంద్ర మోదీ – జపాన్ ప్రధాని యోషిహిదే సుగాల మధ్య ఆసక్తికర చర్చలు