Hyderabad Student: హమ్మయ్య.. అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్ధిని సేఫ్‌!

గత వారం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థిని నితీశా కందుల (23) క్షేమంగా ఉన్నట్లు పోలీసులు మంగళవారం (జూన్‌ 4) తెలిపారు. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్‌బెర్నార్డినో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈరోజు వెల్లడించింది. శాన్ బెర్నార్డినో (CSUSB)లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో..

Hyderabad Student: హమ్మయ్య.. అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్ధిని సేఫ్‌!
Nitheesha Kandula

Updated on: Jun 04, 2024 | 10:00 PM

గత వారం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థిని నితీశా కందుల (23) క్షేమంగా ఉన్నట్లు పోలీసులు మంగళవారం (జూన్‌ 4) తెలిపారు. ఆమెను సురక్షితంగా గుర్తించినట్లుగా శాన్‌బెర్నార్డినో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈరోజు వెల్లడించింది. శాన్ బెర్నార్డినో (CSUSB)లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న నితీషా కందుల అనే విద్యార్థిని మే 28 నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో సాయం కోసం ఆమె కుటుంబసభ్యులు సోషల్‌మీడియా వేదిక ద్వారా అక్కడి పోలీసులను అభ్యర్థించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన శాన్‌ బెర్నార్డినో పోలీసులు నితీషా లొకేషన్‌పై సమాచారం కోసం పోలీసులు పబ్లిక్ అప్పీల్ చేశారు. చివరిగా లాస్‌ ఏంజెల్స్‌లో కాలిపోర్నియా నంబర్‌ ప్లేట్‌తో ఉన్న ఓ టయోటా కారు నడుపుతూ మే 30న కనిపించినట్లు కొంత మంది చెప్పినట్టు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా చివరకు క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని CSUSB పోలీసు చీఫ్ జాన్ గుట్టీరెజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కాగా గత కొంతకాలంగా అమెరికాలో భారతీయ విద్యార్ధులు వరుస ప్రమాదాల్లో అదృశ్యమవుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో 26 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింద్ అనే మరో భారతీయ విద్యార్థి చికాగోలో అదృశ్యమయ్యాడు. ఇదే ఏడాది మార్చిలో హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అనే విద్యార్థి ఏప్రిల్‌లో క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. అర్ఫాత్ క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఐటిలో మాస్టర్స్ చడవడానికి మే నెలలోనే సదరు విద్యార్ధి యుఎస్ వచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.