Trump: ట్రంప్​​‌కి బిగ్​ షాక్​.. 34 కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు..

Trump: ట్రంప్​​‌కి బిగ్​ షాక్​.. 34 కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు..

Anil kumar poka

|

Updated on: Jun 04, 2024 | 2:20 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హష్ మనీ పేమెంట్స్‌ సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హష్ మనీ పేమెంట్స్‌ సహా 34 కేసుల్లో దోషిగా తేలారు. అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో అగ్రరాజ్యం చరిత్రలో నేరాలకు పాల్పడిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. తీర్పు వెలువరించే ముందు ట్రంప్ ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపించలేదు. ట్రంప్ విరోధులు మాత్రం ఆనందంతో కేరింతలు కొట్టారు. కోర్టు బయట సంబరాలు చేసుకున్నారు. ట్రంప్‌ను దోషిగా తేల్చినా ఆయనకు ఎప్పుడు శిక్ష విధిస్తారనే అంశాన్ని కోర్టు ప్రస్తావించలేదు. ఒకవేళ ట్రంప్ జైలుకు వెళ్తే నవంబర్‌లో ఆయనకు ఓటువేసే హక్కు ఉండదని తెలుస్తోంది. కోర్టు తీర్పు అనంతరం మాట్లాడిన ట్రంప్, తాను అమాయకుడిననీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. న్యాయం కోసం పోరాడతానని తెలిపారు.

స్టార్మీ డేనియల్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్‌ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని చెప్పారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని అందులో పేర్కొన్నారు. అందుకోసం బిజినెస్‌ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం అవన్నీ నిజమేనని తాజాగా న్యూయార్క్​ కోర్టు తేల్చింది. ట్రంప్‌తో అక్రమ సంబంధం నిజమేనని స్టార్మీ డేనియల్స్‌ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.