AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మూడోసారి ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ దేశాల నుంచి ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ..

కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా.. అలాగే ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా మూడోసారి గెలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం అభినందనలు తెలిపారు.

PM Modi: మూడోసారి ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ దేశాల నుంచి ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Jun 05, 2024 | 12:10 PM

Share

కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్న నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా.. అలాగే ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా మూడోసారి గెలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంగళవారం అభినందనలు తెలిపారు. ఇటలీ, భారత్‌ల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తూనే ఉంటానని ఆమె చెప్పారు. ప్రధాని మోదీ కూడా తన ఇటాలియన్ కౌంటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నారు.

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ సహా అనేక ఇతర ప్రపంచ నాయకులు PM మోడీని అభినందించారు.. భారత్ తో సన్నిహితంగా పని చేయడానికి ఆసక్తితో ఉన్నామని వెల్లడించారు.

మోడీ నాయకత్వంలోని పురోగతి, శ్రేయస్సుపై భారతీయ ప్రజల విశ్వాసాన్ని నిరూపిస్తూ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ విజయం సాధించినందుకు అధ్యక్షుడు విక్రమసింఘే తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస కూడా నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

నేపాల్ ప్రధాన మంత్రి..

నేపాల్ ప్రధాన మంత్రి ‘ప్రచండ’ కూడా ప్రధాని మోదీని అభినందించారు. “వరుసగా మూడవసారి లోక్‌సభ ఎన్నికలలో BJP – NDA ఎన్నికల విజయాన్ని సాధించినందుకు మోదీ అభినందనలు. భారతదేశ ప్రజల ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు మేము సంతోషిస్తున్నాము” అంటూ X లో ఒక పోస్ట్‌ చేశారు.

మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌

మోదీ చారిత్రాత్మక విజయం సాధించినందుకు మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నాథ్‌ అభినందనలు తెలిపారు.

మాల్దీవుల అధ్యక్షుడు శుభాకాంక్షలు..

మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జూ కూడా మోడీని అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రధానితో కలిసి పనిచేయాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

భూటాన్ ప్రధాని శుభాకాంక్షలు..

భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే కూడా చారిత్రాత్మక విజయం సాధించడంపై మోడీ – ఎన్‌డిఎకు అభినందనలు తెలిపారు. అతనితో సన్నిహితంగా పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.

బార్బోడోస్ ప్రధాని మియా అమోర్ మొట్టెలీ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..