Lok Sabha Election Result 2024: అదృష్టం అంటే ఇదే.. ఉత్కంఠ పోరులో 48 ఓట్లతోనే గెలుపు.. అత్యల్ప మెజార్టీతో గెలిచింది వీరే..
ఉత్కంఠగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై చేయి సాధించి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇండియా కూటమి కూడా గట్టిగానే పోటిఇచ్చింది.. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి - 292 (బీజేపీ -240), ఇండియా కూటమి -232 (కాంగ్రెస్ -99), ఇతరులు -17 మంది గెలుపొందారు. అయితే.. ఏడు విడతల్లో హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో..

ఉత్కంఠగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పై చేయి సాధించి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇండియా కూటమి కూడా గట్టిగానే పోటిఇచ్చింది.. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి – 292 (బీజేపీ -240), ఇండియా కూటమి -232 (కాంగ్రెస్ -99), ఇతరులు -17 మంది గెలుపొందారు. అయితే.. ఏడు విడతల్లో హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో కొందరు గత రికార్డులను తిరగరాస్తూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని నమోదు చేసుకోగా.. కొందరు ఉత్కంఠ పోరులో చిన్న మార్జిన్ తో గెలుపొందారు. మహారాష్ట్రలో ఓ నేతను కేవలం 48 ఓట్ల తేడాతో విజయం వరించింది.
అత్యల్ప మెజార్టీ సాధించిన నేతలు వీరే..
ముంబై నార్త్ వెస్ట్..
మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన పార్టీ తరఫున రవీంద్ర దత్తారామ్ వైకర్, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే ) నుంచి అన్మోల్ కీర్తికర్ నిలబడ్డారు. వీరి మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా.. చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రవీంద్రకు 4,52,644 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు రావడం గమనార్హం.
అత్తింగళ్..
కేరళలోని అత్తింగళ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్వొకేట్ అదూర్ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థి సీపీఎం జాయ్ పై 684 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థి జాయ్ కు 3,27,367 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పడ్డాయి.
జయపురంలో..
ఒడిశాలోని జయపురంలో బీజేపీ అభ్యర్థి రబీంద్ర నారాయణ్ బెహరా (5,34,239 ఓట్లు) రాగా.. తన సమీప బిజు జనతాదళ్ అభ్యర్థి శర్మిష్ఠా సేథి (5,32,652)పై 1587 ఓట్లతో విజయం సాధించారు. నోటాకు 6,788 ఓట్లు వచ్చాయి.
జైపూర్ రూరల్..
రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఛోప్రా (6,16,262), బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ (6,17,877 ఓట్లు) చేతిలో 1615 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ కూడా మెజార్టీ కంటే నోటాకే అత్యధికంగా 7,519 ఓట్లు పోలవ్వడం గమనార్హం..
కాంకేర్ స్థానంలో
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ (5,97,624) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీరేశ్ ఠాకుర్ (5,95,740)పై 1884 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో నోటాకు ఏకంగా 18,669 ఓట్లు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




