Bomb Threat: మరో విమానానికి బాంబు బెదిరింపులు.. ! టేకాఫ్‌కు కొన్ని క్షణాల ముందుగా..
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానంలో విస్తృత నిఖీలు నిర్వహించారు. చివరకు..
ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి. అది కూడా విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఫేక్ కాల్స్ ఎక్కువగా వస్తున్న సంఘటనల పరంపర పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విమానయాన పరిశ్రమలో భద్రతా హెచ్చరికలను పెంచింది. తాజాగా తాజాగా ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఢిల్లీ నుండి టొరంటో వెళ్లే ఎయిర్ కెనడా విమానం (AC43) ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అవసరమైన స్క్రీనింగ్ విధానాల కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు మళ్లించమని అధికారులను పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఎయిర్ కెనడా కు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటో కు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్టుగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానంలో విస్తృత నిఖీలు నిర్వహించారు. చివరకు బెదిరింపు బూటకమని తేలింది. దాంతో అధికారులు, అటు ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బాంబు బెదిరింపు అనంతరం ప్రోటోకాల్‌ను అనుసరించి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..