ఏటీఎం సెంటర్లో మంటలు.. కట్ చేస్తే నగదు మాయం..! వామ్మో వీళ్ల ఐడియా మామూలుగా లేదు మరి..

దొంగలు చాలా తెలివి మీరిపోయారు. నేరం చేయడమే కాదు ఆధారాలు దొరక్కుండా పని పూర్తి చేసి పారిపోతున్నారు. తాజాగా ఓ ఏటీఎం సెంటర్లో దోచుకునే తీరు పోలీసులను కంగు తినేలా చేశారు. రాత్రి వేళ కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి సుమారు రూ.17లక్షలు దోచుకెళ్లారు..ఈ ఘటన

ఏటీఎం సెంటర్లో మంటలు.. కట్ చేస్తే నగదు మాయం..! వామ్మో వీళ్ల ఐడియా మామూలుగా లేదు మరి..
Sbi Atm
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2024 | 6:57 AM

అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.17లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన అనకాపల్లి జిల్లాలోని పరవాడ దేశపాత్రునిపాలెంలో చోటు చేసుకుంది. గాజువాక- ఎలమంచిలి రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి 2నుంచి 3:30గంటల సమయంలో చోరీ జరిగినట్లు పరవాడ సీఐ బాలసూర్యారావు తెలిపారు. రాత్రి వేళ కారులో వచ్చిన దుండగులు..ముందుగా సీసీ కెమెరాల తీగలు కత్తరించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కోసి అందులోని రూ.17లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు.

ఏటీఎం సెంటర్లో ఉన్న రెండు ఏసీలు 6 సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సీసీ కెమెరాలు లో ఎటువంటి దృశ్యాలు రికార్డు కాలేదు. ఏటీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి పోలీసులే కంగుతిన్నారు. పరవాడ డిఎస్పి సత్యనారాయణ ఏటీఎం సెంటర్ ని పరిశీలించారు. స్థానికంగా విచారించారు. దీంతో.. వేకువజామున ఏటీఎం సెంటర్ వద్ద ఒక కారు.. ఇద్దరు వ్యక్తులు మూట పట్టుకొని వెళ్లిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల వైర్లను ముందే కత్తిరించినట్టు గుర్తించారు.

అయితే ఏటీఎం సెంటర్లలో ఏసీలు కాలిపోయిన ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టర్లతో ఏటీఎం మెషిన్ ను కట్ చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయాయా.. లేక వెళ్తూ వెళ్తూ కాల్ చేశారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఏటీఎం మిషన్లు ఉన్నప్పటికీ ఒక దాన్నే టార్గెట్ చేయడం పైన అనుమానం వ్యక్తం అవుతుంది. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..