AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How To Apply Sunscreen: మీరు కూడా సన్‌‌స్క్రీన్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలం, మేఘావృతమైన రోజులు, చలికాలంలో కూడా మీరు బయటికి వెళ్లినప్పుడల్లా మీ చర్మం సూర్యుడి హానికరమైన UV కిరణాలకు గురవుతుంది. కాబట్టి మీరు ఏ కాలంలోనైనా సరే, లేదా సమీపంలో ఎక్కడైనా ప్రయాణిస్తున్నా, సన్‌స్క్రీన్‌ని ఉపయోగించుకోవాలని గుర్తుంచుకోండి.

How To Apply Sunscreen: మీరు కూడా సన్‌‌స్క్రీన్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Sunscreen
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2024 | 10:49 AM

Share

దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి కొనసాగింది. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. మండుతున్న ఎండలు, వేడిమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో పనికి వెళ్లాల్సిన వ్యక్తులు బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్ రాసుకుంటే చర్మ సంరక్షణగా పనిచేస్తుంది. ఇది కాకుండా, సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని చర్మ క్యాన్సర్, సన్‌బర్న్, అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే, ఇది మరింత ప్రభావవంతంగా ఉండాలంటే మీరు మంచి రక్షణను పొందేందుకు సన్‌స్క్రీన్ ని సరైన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికన్ సొసైటీ ఆఫ్ డెర్మటాలజీ సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడానికి సరైన మార్గాన్ని చెప్పింది. ఇది మీరు కూడా తెలుసుకోవాలి.

అమెరికన్ సొసైటీ ఆఫ్ డెర్మటాలజీ ఎల్లప్పుడూ SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ని ఎంచుకోవాలని చెప్పింది. ఇది నీటి నిరోధకత,UVA, UVB కిరణాల బారి నుండి రక్షిస్తుంది. సన్‌స్క్రీన్‌లో ఐరన్ ఆక్సైడ్ ఉన్నప్పుడు, ఐరన్ ఆక్సైడ్ మీ చర్మాన్ని సూర్యకాంతి నుండి రక్షిస్తుంది. ముఖంపై ఏర్పడే మచ్చలను నివారిస్తుంది.

మీ చర్మం సన్‌స్క్రీన్‌ను గ్రహించి, మీకు రక్షణ కల్పించడానికి సుమారు 15 నిమిషాలు పట్టవచ్చు. కాబట్టి మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత మాత్రమే ఎండలోకి వెళ్లాలి. లేదంటే మీ చర్మం టాన్‌గా మారవచ్చు.

ఇవి కూడా చదవండి

చాలా మందికి తమ శరీరాన్ని పూర్తిగా కవర్ చేయడానికి 28 గ్రాముల సన్‌స్క్రీన్ అవసరం. ఎండలో ఎక్స్‌పోజ్‌ అయ్యే చర్మంపై సన్‌స్క్రీన్‌ను పూర్తిగా అప్లై చేయండి. అప్పుడు మాత్రమే మీకు రక్షణ లభిస్తుంది. లేకుంటే మీకు తగిన రక్షణ లభించదు.

తరచుగా మహిళలు ముఖం, మెడపై మాత్రమే సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తారు. కానీ అలా చేయడం తప్పు. ఎందుకంటే మీరు మీ చర్మంపై అంటే మెడ, ముఖం, చెవులు, కాళ్లు, పాదాలపై కూడా సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి. మహిళలు డీప్ నెక్ లేదా వీపు ఉన్న దుస్తులు ధరిస్తే, ఆ ప్రాంతంలో కూడా సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు. మీ పెదాలను రక్షించుకోవడానికి, కనీసం 30 SPFతో లిప్ బామ్‌ను అప్లై చేయండి. మీరు ఎండలో ఉన్నట్లయితే, ప్రతి రెండు గంటలకు ఒకసారి, ముఖం కడిగినా లేదంటే, చెమట పట్టినా వెంటనే సన్‌స్క్రీన్‌ని మళ్లీ అప్లై చేయండి.

వర్షాకాలం, మేఘావృతమైన రోజులు, చలికాలంలో కూడా మీరు బయటికి వెళ్లినప్పుడల్లా మీ చర్మం సూర్యుడి హానికరమైన UV కిరణాలకు గురవుతుంది. కాబట్టి మీరు ఏ కాలంలోనైనా సరే, లేదా సమీపంలో ఎక్కడైనా ప్రయాణిస్తున్నా, సన్‌స్క్రీన్‌ని ఉపయోగించుకోవాలని గుర్తుంచుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..