AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కోడి కోసం 10అడుగుల గోడపైకి దూకిన చిరుత.. చివరికి ఏం జరిగిందంటే..!

వీడియోలో కోడిని వేటాడేందుకు ప్రయత్నించిన చిరుత ఎత్తైన గోడపైకి దూకింది. దాంతో భయపడిపోయిన ఆ కోడి ఏం చేసింది..! ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో చిరుత వేటకు సంబంధించిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిరుత సంచారం గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Watch: కోడి కోసం 10అడుగుల గోడపైకి దూకిన చిరుత.. చివరికి ఏం జరిగిందంటే..!
Leopard Jumps Over 10-Ft-Long Wall
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2024 | 8:48 AM

Share

తమిళనాడులోని కోయంబత్తూరులో చిరుతపులి కోడిని వేటాడిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్‌ ఘటన కోయంబత్తూరులోని సోమయనూర్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు కోయంబత్తూరులోని నివాస ప్రాంతంలో చిరుతపులి కనిపించటంతో స్థానికులు భయంతో హడలెత్తిపోతున్నారు. చిరుతపులి కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.. దీంతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు అటవీ శాఖ అధికారులు. వైరల్‌ వీడియోలో దాదాపు పది అడుగుల ఎత్తులో ఉన్న ఇంటి గోడపై కూర్చున్న కోడిని పట్టుకునేందుకు చిరుత అమాంతంగా దూకిన దృశ్యం.. ఆ ఇంటి పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డైంది.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 29న తెల్లవారుజామున 5 గంటలకు సోమయనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్టుగా సీసీ ఫుటేజ్‌ ఆధారంగా తెలిసింది. వీడియోలో కోడిని వేటాడేందుకు ప్రయత్నించిన చిరుత ఎత్తైన గోడపైకి దూకింది. దాంతో భయపడిపోయిన ఆ కోడి గోడకు మరోవైపు దూకింది. చిరుత కూడా అటు దూకి ఆ కోడిని వేటాడింది. దానిని నోటకరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో చిరుత వేటకు సంబంధించిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిరుత సంచారం గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..