ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు రావద్దు ఏనుగు
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు.
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. దాదాపు 60 ఎకరాల్లో మామిడి చెట్లను చీల్చి చెండాడాయి. తోటలోనే తిష్ట వేసిన ఏనుగులను తరిమికొట్టేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి పళ్ల సీజన్ లో ఇలా ఏనుగులు మామిడిచెట్లను ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి అయితే చాలు మామిడితోటల్లోకి ఏనుగులు చొరబడి బీభత్సం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి జంతువులు రాకుండా గతంలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన ట్రెంచ్ అకాల వర్షాలకు పూడుకుపోయిందని, దాంతో జంతువులు గ్రామాల్లోకి కూడా చొరబడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏనుగులకు తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??
TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

