గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??

సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఈ నేపథ్యంలో దేశంలోని సామాన్యులకు మళ్లీ కొంత ఉపశమనం లభించింది. గ్యాస్‌ సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా మూడో నెలలోనూ తగ్గించాయి. దీంతో చిరువ్యాపారులకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను 69 రూపాయల 50 పైసల మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి.

గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంతంటే ??

|

Updated on: Jun 04, 2024 | 11:11 PM

సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఈ నేపథ్యంలో దేశంలోని సామాన్యులకు మళ్లీ కొంత ఉపశమనం లభించింది. గ్యాస్‌ సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా మూడో నెలలోనూ తగ్గించాయి. దీంతో చిరువ్యాపారులకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను 69 రూపాయల 50 పైసల మేర తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. కాగా తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,676 లు, కోల్‌కతాలో రూ. 1,787లు, ముంబైలో రూ.1,629లు, చెన్నైలో రూ. 1,840లకు తగ్గాయి. మే 1న కూడా రూ.19 మేర, అంతకుముందు ఏప్రిల్‌లో రూ.30.50 మేర తగ్గింది. దీంతో ఆర్థిక సవాళ్ల మధ్య నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారస్తులకు ఈ నిర్ణయం కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా తాజా ధరల సవరణ చేపట్టాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??

TOP 9 ET News: గుడ్‌ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్‌ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్

కార్తికేయ కోసం.. కోట్ల లగ్జరీ కారును లెక్కచేయని

10 కోట్ల ఇస్తామన్నా… మాటకు కట్టుబడి నో అన్నాడు !! దటీజ్ అల్లు అర్జున్‌ !!

Follow us