చిటికెడు ఇంగువతో ఇన్ని లాభాలా..? తెలిస్తే క్రమం తప్పకుండా వాడుతారు!
చిటికెడు ఇంగువ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోర, రసం, సాంబారు, పచ్చళ్లు అన్నింట్లో వాడతాం. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది.
ఇంగువ… ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం పొడిగా.. ముద్దగా.. రెండు రకాల్లో లభ్యమవుతుంది. చాలా మంది దీని వాసన కారణంగా తినడానికి ఇష్టపడరు. కానీ,ఎక్కువ మంది దీనిని ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ, ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోర, రసం, సాంబారు, పచ్చళ్లు అన్నింట్లో వాడతాం. పదార్థాలు బూజు పట్టకుండా చేస్తుంది. ఇంగువ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది కడుపునొప్పి వంటి ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
మనం రోజూ తీసుకునే ఆహారంలో చిటికెడు ఇంగువను చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చిటికెడు ఇంగువ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే చాలా ఏళ్లుగా దీన్ని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ పొడిలోని యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస ఇబ్బందులను తగ్గిస్తాయి.
సెనగగింజ పరిమాణంలో బెల్లం మధ్యలో పెట్టి తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లను బాగా మరిగించి చిటికెడు ఇంగువ వేసి రోజు రెండు మూడు సార్లు తాగితే తలనొప్పి మాయమవుతుంది. సెనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తీసుకుంటే నులిపెరుగుల సమస్య ఉండదు. అన్నంలో మొదటి ముద్దను నెయ్యి, వాము, ఇంగువతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలుండవు. అయితే ఎక్కుగా తీసుకుంటే విరోచనాలు అవుతాయి.
ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. ఇంగువలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. వివిధ రకాల సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది కార్డియోవాస్కులర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది రక్త ప్రసరణను కూడా సాధారణీకరిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..