Overhydration: ఆరోగ్యానికి మంచిది అంటూ నీరు తెగ తాగేస్తున్నారా..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలెర్ట్..

శరీరానికి నీటిని గ్రహించే సామర్థ్యం ఉంది. అయితే ఎంత పరిమాణాన్ని తాగాలి అనే విషయాన్నీ దృష్టిలో ఉంచుకోకుండా నీటిని తాగడం ప్రారంభిస్తే, శరీరంలో నీరు చేరడం ప్రారంభమవుతుంది. సైన్స్ భాషలో నీటి మత్తు అంటారు. శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది. శరీరంలో నీరు లేకపోవడమో లేదా అధికంగా ఉన్నా.. ఎటువంటి సందర్భంలోనైనా శరీరం ఖచ్చితంగా కొంత సిగ్నల్ ఇస్తుంది. ఈ రోజు ఎక్కువ నీరు శరీరంలో చేరితే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..

Overhydration: ఆరోగ్యానికి మంచిది అంటూ నీరు తెగ తాగేస్తున్నారా..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలెర్ట్..
Overhydration
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2024 | 8:07 AM

వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం తరచుగా నీరు త్రాగాలని సలహా ఇస్తారు నిపుణులు. వేసవిలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే నీరు సరిగా తాగడం లేదంటూ తగినంత నీరుని తాగమని సూచిస్తారు కూడా అయితే.. అతి సర్వత్రా వర్జయేత్ అన్న చందంగా ఏదైనా మితిమీరితే హానికరమే.. అదే విధంగా నీరు తాగమన్నారు కదా అని ఏకబిగిన నీరు తాగుతూ ఉంటే.. అది ఆరోగ్యానికి హానికరం. వాస్తవానికి తగినంత నీరు త్రాగడం వల్ల ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. అయితే ఎక్కువ నీరు త్రాగితే ప్రయోజనాలకు బదులుగా శరీరానికి హాని కలిగడం మొదలవుతుంది.

శరీరానికి నీటిని గ్రహించే సామర్థ్యం ఉంది. అయితే ఎంత పరిమాణాన్ని తాగాలి అనే విషయాన్నీ దృష్టిలో ఉంచుకోకుండా నీటిని తాగడం ప్రారంభిస్తే, శరీరంలో నీరు చేరడం ప్రారంభమవుతుంది. సైన్స్ భాషలో నీటి మత్తు అంటారు. శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది. శరీరంలో నీరు లేకపోవడమో లేదా అధికంగా ఉన్నా.. ఎటువంటి సందర్భంలోనైనా శరీరం ఖచ్చితంగా కొంత సిగ్నల్ ఇస్తుంది. ఈ రోజు ఎక్కువ నీరు శరీరంలో చేరితే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం..

నీటి మత్తు అంటే ఏమిటి?

మనం శారేరానికి కావాల్సిన నీరు కంటే ఎక్కువ నీరు తాగినప్పుడు నీటి మత్తు సమస్య వస్తుంది. ఇది మెదడు పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో ఎలక్ట్రోలైట్లను, ముఖ్యంగా సోడియంను పలుచన చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ సంకేతాలు ఎక్కువ నీరు త్రాగిన తర్వాత శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి:

వికారం లేదా వాంతులు అనుభూతి: శరీరంలో నీటి పరిమాణం తగ్గినప్పుడు దానిని డీహైడ్రేషన్ అంటారు. అలాగే నీటి పరిమాణం పెరిగినప్పుడు దానిని ఓవర్‌హైడ్రేషన్ అంటారు. శరీరంలో ఎక్కువ నీరు ఉన్నప్పుడు.. మూత్రపిండాలు పని తీరుపై ప్రభావం చూపిస్తుంది. అదనపు ద్రవాన్ని తొలగించలేవు. అప్పుడు ఆ నీరు శరీరంలో పేరుకుపోవడం ప్రారంభించి.. వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది.

నిరంతర తలనొప్పి: హైడ్రేషన్, డీహైడ్రేషన్ పరిస్థితుల్లో కూడా తలనొప్పి సమస్యను ఎదుర్కోవచ్చు. శరీరంలో నీటి పరిమాణం పెరిగినప్పుడు ఉప్పు స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా కణాల్లో వాపు మొదలవుతుంది. ఈ వాపు కారణంగా కణాలు పెద్దవిగా మారతాయి. మెదడులో ఉన్న కణాలు తలపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఒత్తిడి కారణంగా నిరంతరం తలనొప్పి అనుభూతి చెందుతారు.

మరింత అలసిపోయినట్లు అనిపిస్తుంది: నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆ నీటిని బయటకు పంపడానికి కిడ్నీలు చాలా కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా కొన్నిసార్లు హార్మోన్లు కూడా అసమతుల్యత చెందుతాయి. దీని వలన మరింత అలసిపోయినట్లు అనిపించవచ్చు.

మరిని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్