Weight Loss: కొబ్బరి నూనెను ఇలా వాడితే ఈజీగా బరువు తగ్గుతారు..! 5 రోజుల్లో నాజుకు నడుము మీ సొంతం..!!

రోజుకు 2 నుండి 3 చెంచాల కొబ్బరి నూనె తీసుకోవడం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, గ్యాస్ట్రిక్ సమస్యలు, అపానవాయువు , మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

Weight Loss: కొబ్బరి నూనెను ఇలా వాడితే ఈజీగా బరువు తగ్గుతారు..! 5 రోజుల్లో నాజుకు నడుము మీ సొంతం..!!
కొబ్బరి నూనెను జుట్టు మూలాల నుంచి పట్టించడం ద్వారా కురులకు పోషకాలు అందించేందుకు వీలుంటుంది. జుట్టుకు కొబ్బరి నూనెను రెగ్యులర్ అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు గరుకుదనం కూడా కొబ్బరి నూనెతో సులభంగా తొలగిపోతుంది.
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 05, 2024 | 8:17 AM

బరువు తగ్గడానికి గోరువెచ్చని నీళ్లలో నిమ్మ, తేనె, దాల్చినచెక్క కలిపి తాగడం గురించి మీరు వినే ఉంటారు. కానీ, బరువు తగ్గడానికి వేడినీళ్లలో కొబ్బరినూనె కలిపి తాగడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయుర్వేదంలో కొబ్బరి నూనెను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలని సూచిస్తున్నారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గోరువెచ్చని నీటిలో కొబ్బరినూనెను కలిపి తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంట్లోనే ఉంటూ ఈజీగా బరువు తగ్గాలనుకునే వారు గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనెను కలిపి తాగాలని సూచిస్తున్నారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. గోరువెచ్చని నీళ్లలో కొబ్బరినూనెను రెగ్యులర్ గా తీసుకుంటే శరీర బరువు తగ్గుతుంది.

అవును, మీరు కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఒక నెలలో బరువు తగ్గవచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొబ్బరినూనె కలుపుకుని తాగటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనె ఒక భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఆహారం మరింత త్వరగా, సులభంగా శరీరంలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని దరి చేరకుండా చేస్తుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు చాలా తక్కువగా ఉంటాయి. రోజుకు 2 నుండి 3 చెంచాల కొబ్బరి నూనె తీసుకోవడం ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, గ్యాస్ట్రిక్ సమస్యలు, అపానవాయువు , మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలకు కొబ్బరి నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

కొబ్బరి నూనెలోని యాసిడ్ ఆహారంలో అధిక కొవ్వును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇందులోని పోషకాలు కాలేయానికి చేరి అధిక కొవ్వును తగ్గిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో 1 టీస్పూన్ పచ్చి కొబ్బరి నూనె తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. ఇది శరీరంలోని కొవ్వును త్వరగా తగ్గిస్తుంది. నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే నెల రోజుల్లో బరువు తగ్గొచ్చు. అయితే, కొబ్బరి నూనెను ఎప్పుడూ అతిగా తీసుకోవద్దు. ఇలా చేస్తే తిమ్మిరి, విరేచనాలకు దారితీయవచ్చు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..