AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఏనుగు బలం ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.. రోడ్డును బ్లాక్‌ చేసి ఎలా బుక్‌ చేసిందో చూడండి..

ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసింది. ఏనుగు దాదాపు ఎండిపోయిన ఒక భారీ వృక్షాన్ని నిమిషాల వ్యవధిలో బేస్ నుండి విరగొట్టి రోడ్డుకు అడ్డంగా కూల్చేసింది. ఈ అరుదైన దృశ్యం వీక్షకులను షాక్‌ అయ్యేలా చేసింది. 2 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వీడియోను వీక్షించారు. ఏనుగు బలాన్ని చూసి తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

Watch: ఏనుగు బలం ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..  రోడ్డును బ్లాక్‌ చేసి ఎలా బుక్‌ చేసిందో చూడండి..
Wild Animal
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2024 | 9:16 AM

Share

నిరసనలు, రోడ్‌బ్లాక్, భారత్ బంద్, రాష్ట్రం బంద్ మొదలైనవాటిలో ప్రజలు సాధారణంగా రోడ్డును బ్లాక్‌ చేస్తుంటారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి తమ నిరసన తెలియజేస్తుంటారు. అయితే ఏనుగులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ప్రయాణికుల్ని, వాహనదారులను అడ్డుకోవటం ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా..? అవును ఒకచోట గజరాజులు రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలను కూల్చివేసి రోడ్డుపై వెళ్లే ట్రాఫిక్‌ను అడ్డుకున్నాయి. ఇలాంటి అరుదైన దృశ్యం కెమెరాలో బంధించబడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విట్టర్ పేజీ పోస్ట్ చేసింది. ఏనుగు దాదాపు ఎండిపోయిన ఒక భారీ వృక్షాన్ని నిమిషాల వ్యవధిలో బేస్ నుండి విరగొట్టి రోడ్డుకు అడ్డంగా కూల్చేసింది. ఈ అరుదైన దృశ్యం వీక్షకులను షాక్‌ అయ్యేలా చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఎండ కారణంగా దాదాపుగా ఎండిపోయిన చెట్లే కనిపిస్తున్నాయి. చూట్టంతా చెట్లతో ఉన్న అడవి మధ్యలో తారు రోడ్డు వెళుతుంది. రెండు బలమైన దంతాలతో అటవీ ఏనుగు రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్టును తన తొండంతో బలంగా నెడుతూ కూల్చివేసింది. ఏనుగు బలమైన శక్తి కారణంగా చెట్టు ఒక దుంగలా పటపటా విరుగుతూ కింద పడిపోవడం చూడవచ్చు. బహుశా ఆ దారిలో వచ్చిన వాహనదారులు ఈ అరుదైన దృశ్యాన్ని బంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను పోస్ట్ చేసిన ‘నేచర్ ఈజ్ అమేజింగ్’ పేజీ.. ఏనుగులకు అంత శక్తి ఉందని ఈరోజే తెలిసిందని రాసింది. 2 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వీడియోను వీక్షించారు. ఏనుగు బలాన్ని చూసి తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…