AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్మ ఫలం అంటే ఇదే.. రోడ్డు పక్కన కూర్చున్న వృద్ధురాలు.. తన్ని పక్కకు పంపిన పోలీసు..

మహిళను తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్దురాలు రోడ్డు పక్కన కూర్చున్న దృశ్యాన్ని చూడవచ్చు. అక్కడికి వచ్చిన మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారి.. ఆ వృద్ధురాలిని తన్ని తరిమి తరిమి కొట్టిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

కర్మ ఫలం అంటే ఇదే.. రోడ్డు పక్కన కూర్చున్న వృద్ధురాలు.. తన్ని పక్కకు పంపిన పోలీసు..
Cop Kicks Woman
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 10:43 AM

Share

హిందూ ధర్మంలో కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ తగిన ఫలితాన్ని తిరిగి ఇచ్చేస్తుందని విశ్వాసం. ఇందుకు సంబంధించిన అనేక సంఘటలు ఉదాహరణలుగా కనుల ముందు సాక్షంగా నిలుస్తున్నాయి. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోడ్డు పక్కన కూర్చున్న వృద్ధురాలి దగ్గరకు ఓ మహిళా ట్రాఫిక్ పోలీసు చేరుకుంది. ఆ వృద్ధురాలిని అక్కడ నుంచి లేవమని.. అంటూ.. ఆ మహిళను తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్దురాలు రోడ్డు పక్కన కూర్చున్న దృశ్యాన్ని చూడవచ్చు. అక్కడికి వచ్చిన మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారి.. ఆ వృద్ధురాలిని తన్ని తరిమి తరిమి కొట్టిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. వృద్ధురాలిని తరిమి కొట్టిన మహిళా పోలీసు అక్కడ నిల్చుని ఉంది.. అప్పుడు సడెన్ గా ఓ వాహనం అటుగా వచ్చి ఆమెని గుద్దింది.

ఈ వీడియో @malladi_rag అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం, వీడియో కేవలం 6 రోజుల షేర్‌లో 3.5 మిలియన్లు అంటే 30 లక్షల మందికి పైగా చూశారు. అలాగే 151,496 మంది వీడియోను లైక్ చేసారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ‘ఇది నిజమైన సంఘటన కాదు, స్క్రిప్ట్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే చివర్లో ఓ మంచి సందేశం ఇచ్చినట్లు కనిపిస్తుంది. మరికొందరు కర్మం ఫలం అంటే ఇదే అంటూ.. చేసిన మంచి, చెడులు ఎప్పుడూ ఎక్కడకి పోవు.. తిరిగి అందుకు తగిన ఫలాలను ఇచ్చేస్తాయి అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..