AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్యావుడా..! డయల్ 100ని ఇలా కూడా యూజ్ చేస్తారా! ప్రియుడు మాట్లాడం లేదని యువతి పోలీసులకు ఫిర్యాదు

ప్రేమ పిచ్చి గురించి మీరు చాలా కథలు విని ఉంటారు.. అయితే జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని మైథాన్‌కి చెందిన ఒక అమ్మాయి ప్రేమ పిచ్చి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య ఏదైనా విషయంపై వాగ్వాదం జరిగినప్పుడు.. ఆ కోపంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు.. ఫోన్ చేసుకోరు. ఇలా కొన్ని గంటలు, లేదా రోజులు ప్రేమికులు తమ అలకను సాగిస్తారు.  అయితే  తమ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ తీసి మాట్లాడనప్పుడు చాలా కలత చెందుతారు.

ద్యావుడా..! డయల్ 100ని ఇలా కూడా యూజ్ చేస్తారా! ప్రియుడు మాట్లాడం లేదని యువతి పోలీసులకు ఫిర్యాదు
Lovers Patch Up
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 8:44 AM

Share

ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నాటి పురాణగాథలు మాత్రమే కాదు చరిత్రలో తమ ప్రేమ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ప్రేమికుల కథలు అనేకం కనిపిస్తూనే ఉన్నాయి. ప్రేమ కథ సినిమాలు ఎప్పుడూ హిట్ .. ఇక  ఎల్లలు దాటిన ప్రేమ ఇలా అనేక ప్రేమ కథలు, ప్రేమికుల గురించి వింటూనే ఉన్నాం.. ప్రేమలో ఉన్న వ్యక్తీ భిన్నమైన అనుభూతిని కలిగి ఉంటాడు. హృదయాన్ని, మనస్సును కూడా ప్రేమ శాసిస్తుంది. ప్రేమలో ఉన్న వ్యక్తీ అన్నింటిని మరచిపోతాడు.

ప్రేమ పిచ్చి గురించి మీరు చాలా కథలు విని ఉంటారు.. అయితే జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని మైథాన్‌కి చెందిన ఒక అమ్మాయి ప్రేమ పిచ్చి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య ఏదైనా విషయంపై వాగ్వాదం జరిగినప్పుడు.. ఆ కోపంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు.. ఫోన్ చేసుకోరు. ఇలా కొన్ని గంటలు, లేదా రోజులు ప్రేమికులు తమ అలకను సాగిస్తారు.  అయితే  తమ బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ తీసి మాట్లాడనప్పుడు చాలా కలత చెందుతారు. అప్పుడు వారి స్నేహితులకు లేదా బంధువుకు కాల్ చేస్తారు. అయితే ధన్‌బాద్‌కు చెందిన ఈ అమ్మాయి వెరీ వెరీ స్పెషల్.. తన బాయ్ ఫ్రెండ్ మాట్లాడం లేదంటూ ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది.

యువతి మాటలు విని షాక్ తిన్న పోలీసులు

ఈ అమ్మాయి పిచ్చి చూసి పోలీసులు కూడా కంగుతిన్నారు. పోలీసులు వెంటనే విషయం తెలుసుకున్నారు. సాధారణంగా పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి డయల్ నంబర్ 100 జారీ చేస్తారు. అయితే ఈ అమ్మాయి డయల్ 100కి కాల్ చేసి తన ప్రియుడు ఫోన్ ఎత్తడం లేదని చెప్పింది. అతడు ఎలాగైనా ఫోన్ ఎత్తి మాట్లాడేలా చేయాలని కోరింది.

ఇవి కూడా చదవండి

కేసును ఛేదించిన పోలీసులు

ప్రియురాలి విచిత్రం చర్యలు ఇంతటితో ఆగలేదు.. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అయితే ప్రస్తుతం అతను తనపై ఎందుకో కోపం వచ్చి.. కోపంగా ఉన్నాడని.. ఫోన్ ఎత్తడం లేదని చెప్పింది. ఈ విషయం తనకు చాలా బాధకలిగిస్తుందని .. సీరియస్‌గా తీసుకుని పోలీసులు తన ప్రాబ్లెమ్ పై దృష్టి సారించాలని బాలిక కోరింది. కంట్రోల్ రూమ్‌తో ఈ సంభాషణ తర్వాత.. పోలీసులు కూడా వేగంగా పనిచేసి సమస్యను పరిష్కరించేందుకు మైథాన్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు కూడా అమ్మాయిని నిరాశపరచలేదు.. బదులుగా ఆమెకు సహాయం చేశారు. ఆమెను, ఆమె ప్రియుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి సమస్యను పరిష్కరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..