AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకంలో శని దోషమా.. నివారణ కోసం శని జయంతి రోజున ఈ మంత్రాలను పఠించండి..

శనిశ్వరుడిని పూజించడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొందుతారని మత విశ్వాసం. అలాగే ఈ రోజున శనీశ్వరుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుని వారి ఆశీస్సులు పొందుతారు. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా శనీశ్వరుడు అనుగ్రహాన్ని పొందాలనుకుంటే శని జయంతి రోజున పూజ సమయంలో ఖచ్చితంగా ఈ ప్రత్యేక మంత్రాలను జపించండి. శని జయంతి నాడు ఈ శని మంత్రాలను పఠించడం వల్ల జాతకంలోని శని దోషం తొలగిపోతుందని మనిషి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి నమ్ముతారు.

జాతకంలో శని దోషమా.. నివారణ కోసం శని జయంతి రోజున ఈ మంత్రాలను పఠించండి..
Lord Shani Dev
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 7:37 AM

Share

ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతి పండుగను జరుపుకుంటారు. ఈసారి శని జయంతి జూన్ 6వ తేదీన వచ్చింది. హిందూ పురాణ గ్రంధాల ప్రకారం.. సూర్యుడు, ఛాయాదేవిల తనయుడు శనీశ్వరుడు వైశాఖ మాసం అమావాస్య రోజున జన్మించాడు. ఈ రోజున శనిశ్వరుడిని పూజించడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొందుతారని మత విశ్వాసం. అలాగే ఈ రోజున శనీశ్వరుడికి ఇష్టమైన వస్తువులను సమర్పించి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుని వారి ఆశీస్సులు పొందుతారు. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా శనీశ్వరుడు అనుగ్రహాన్ని పొందాలనుకుంటే శని జయంతి రోజున పూజ సమయంలో ఖచ్చితంగా ఈ ప్రత్యేక మంత్రాలను జపించండి. శని జయంతి నాడు ఈ శని మంత్రాలను పఠించడం వల్ల జాతకంలోని శని దోషం తొలగిపోతుందని మనిషి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి నమ్ముతారు.

జీవితంలో విజయం కోసం కర్మల దాత శనిదేవునికి పటించాల్సిన మంత్రాలు

  1. శక్తివంతమైన శని మంత్రం:ఓం శం శనిశ్చారాయ నమః  ఓం శంనో దేవీరభీష్ట అపో భవన్తుపితయే|ఓం శం శనైశ్చరాయ నమః ఓం సూర్య పుత్రాయ నమః
  2. శని గాయత్రీ మంత్రం:ఓం ఖగథ్వజాయ విద్మహే ఖడ్గ, హస్తాయ ధీమహి తన్నో మందః ..ప్రచోదయాత్| ఓం శనైశ్వరాయ విద్మహే ..సూర్య పుత్రాయ ధీమహి తన్నోః మందః ప్రచోదయాత్
  3. శని దోషం నివారణ మంత్రం: శన్యారిష్టే తు సంప్రాస్తే శని పూజాంచ కారయేత్| శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే
  4. శని శాంతి మంత్రం: క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్| ఛాయామార్తాండ సంభూతం నమస్వామి శనైశ్చరమ్, నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార.. వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ| ఓం సూర్య పుత్రాయ నమః ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ.. క్రిష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కృరాయ|శుద్ధబుద్ధి ప్రదాయనేయ ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్|మదీయం తు భయం తస్య స్వప్నేసి న భవిష్యతి
  5. శని దేవుని భీజ మంత్రం:ఓం ప్రాం ప్రిం ప్రాణ నః.. శనిశ్చరాయ నమః
  6. శని ఆరోగ్య మంత్రం:ధ్వఝినీ ధామినీ చైవ కంకాలీ కలహపృహా |కాంక్తి కలహి చౌఠ తురంగి మహిషి అజా.. శనర్ణమణి భార్యనామేతాని సంజపన్ పుమాన్ దుఖాని నశ్యేన్నిత్యం సౌభాగ్యమేధతే సుఖమ్
  7. శని దోష నివారణ మంత్రం:ఓం త్రమ్బకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ | ఉర్వారుక్ మివ్ బంధనన్ మృత్యోర్ముక్షీయ మా మృత్యత్| ఓం షన్నోదేవీర్భీష్టాయ ఆపో భవన్తు పీఠే శయోర్భిశ్రవన్తు నమః | ఓం శనిశ్చరాయ నమః|
  8. శని పౌరాణిక మంత్రం:ఓం హ్రీం నీలాఞ్జనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ ఛాయా మార్తాండసంభూతం తాన్ నమామి శనశ్చరమ్
  9. శని వేద మంత్రం: ఓం షన్నోదేవీర్-భీష్టాయ, ఆపో భవన్తు పీఠే శయ్యోర్భిస్త్రవంతునః

శనిశ్వరుడికి పూజ విధి

శనిశ్వరుడి అనుగ్రహం పొందడానికి బ్రహ్మ ముహూర్తంలో లేవండి. శని దేవుడికి నమస్కరించి రోజును మొదలు పెట్టండి. స్నానం చేసే సమయంలో నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయండి. తరువాత నల్లని బట్టలు ధరించండి. శని దేవాలయానికి వెళ్లి శనిశ్వరుడిని నిర్మలమైన మనసుతో పూజించండి. దీంతో ఏకాగ్రతతో శని మంత్రాలను జపించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు