AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేడు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా పసిడి, వెండి ధరలు పెరిగినట్లు మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి రూపాయి మేర పెరిగి రూ. 6,681లకు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము కి రూపాయి పెరిగి రూ. 7,288లుగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో ఈ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలతో సహా దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ధరలు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. నేడు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver
Surya Kala
|

Updated on: Jun 05, 2024 | 7:10 AM

Share

భారత దేశంలో పసిడి ప్రియులు ఎక్కువే.. ధరతో సంబంధం లేకుండా బంగారం కొనాలి అనే ఆసక్తి ఉన్నవారు కూడా అధికమే.. అంతేకాదు గత కొంత కాలంగా పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్ లో కూడా పసిడి , వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. స్థిరప్రభుత్వం ఏర్పడదేమోనన్న భయం షేర్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో బంగారం ధర పుంజుకుంది. స్వల్పంగా పసిడి, వెండి ధరలు పెరిగినట్లు మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకి రూపాయి మేర పెరిగి రూ. 6,681లకు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము కి రూపాయి పెరిగి రూ. 7,288లుగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో ఈ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలతో సహా దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ధరలు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, విశాఖ పట్నంతో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ 10 పెరిగి రూ. 66,810లకు చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ధర రూ. 10 పెరిగి రూ.72,880 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ధిల్లీ సహా ప్రధాన నగరాల్లో పసిడి ధరలు

ఇవి కూడా చదవండి

చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,7460, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.7,359కు చేరింది. డిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.6,6960.. 24 క్యారెట్ల ధర రూ.7,3030కు చేరాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 6,6810.. 24 క్యారెట్ల ధర రూ. 7,2880 బెంగళూరులో కూడా బుధవారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 6,6810,24 క్యారెట్ల ధర రూ.7,2880

నేటి వెండి ధర

పురాతన కాలం నుంచి పసిడి తర్వాత విలువైన లోహంగా వెండి ప్రసిద్ధి చెందింది. వెండిని ఆభరణాలు, పాత్రలు, నాణేల తయారీలో మాత్రమే కాదు.. ఇప్పుడు రకరకాల రసాయనిక ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పూజ ఎటువంటి సందర్భమైనా సరే వెండికి ప్రముఖత ఉంది. పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది.. ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. బుధవారం కూడా వెండి ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధ‌ర‌ కిలోకు రూ. 100 లు పెరిగింది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ న‌గ‌రాల్లో కేజీ వెండి నిన్న (మంగళవారం జూన్ 4వ తేదీన రూ. 98,500లు ఉండగా నేడు రూ. 100 లు పెరిగి 1 కేజీ వెండి ధర రూ. 98,600లకు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?