Philippines Plane Crash Land: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమానం ప్రమాదం జరిగింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 85 మందితో వెళుతోన్న మిలిటరీ విమానం ఆదివారం క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జోలో దీవిలోని సులు ప్రావినెన్స్‌లో మిలిటరీకి చెందిన సీ-130 విమానం క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 40 మందిని విమానంలో నుంచి సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. విమానం లోపల ఉన్న మిగతా వారి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఆ దేశ ఆర్మీ చీఫ్ సిరిలిటో సోబెజనా తెలిపారు. విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ విమానంలో ప్రయాణిస్తోన్న వారిలో ఎక్కువ మంది ఇటీవలే బేసిక్ మిలిటరీ శిక్షణలో గ్రాడ్యుయేట్స్ పూర్తి చేశారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన జాయింట్ టాస్క్ ఆపరేషన్‌లో వీరి సహాయాన్ని వినియోగించుకోనున్నారు.
Also Read: Road Accident: నెత్తురోడిన తెలుగు రాష్ట్రాలు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం..
Lovers Suicide: ‘పెళ్లయి ఏడేళ్లయినా.. ప్రియుడిని మరువలేకపోయింది’.. ప్రేమజంట బలవన్మరణం..
కోవిద్ పాండమిక్ తో రెండు తెలుగు రాష్ట్రాల యువతలో పెరిగిన డిప్రెషన్.. ఓ అధ్యయనంలో వెల్లడి