షాపింగ్‌మాల్‌లో చెలరేగిన మంటలు.. 50 మంది మృతి..! ఇరాన్‌లో భారీ అగ్నిప్రమాదం!
ఇరాన్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ షాపిగ్‌మాల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటలు మాల్‌మొత్తం వ్యాపించాయి. ప్రమాదంలో సుమారు 50 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది. మృతుల్లో చాలా వరకు చిన్నారులే ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఓ షాపింగ్‌మాల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి.. ప్రమాదంలో సుమారు 50 మంది వరకు మరణించిన ఘటన తూర్పు ఇరాన్‌లో చోటుచేసుకుంది. మృతుల్లో చాలా వరకు చిన్న పిల్లలే ఉన్నట్టు తెలుస్తోంది. తూర్పు ఇరాక్‌లోని అల్-కుట్ నగరంలోని హైపర్‌మార్కెట్‌లో రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అల్-కుట్‌లోని ఉన్న ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన కొందరు భయంతో బయటకు పరుగులు తీయగా.. అక్కడే చిక్కుకుపోయిన సుమారు 50 మంది మరణించినట్టు అంతర్జాతీయ నివేదికల ద్వారా తెలుస్తోంది. మరి కొందరు గాయాలతో బయటపడినట్టు సమాచారం. అయితే ప్రమాదంలో మరణించిన వారిలో చాలా వరకు చిన్నారులే ఉన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మనం చూడవచ్చు.
MAJOR BREAKING | 60 killed in a massive fire at Iraq shopping mall in the city of Kut. Casualties include women and children.
Initial probe findings to be announced in the next 48 hours.
🎥: Videos circulating on social media. pic.twitter.com/tB4uyEDUpB
— Asawari Jindal (@AsawariJindal15) July 17, 2025
ఇక ఈ ప్రమాదవిషయాన్ని తెలుసుకున్న అధికారుల.. ప్రమాదానికి గల కారణాలను కనుగొనే పనిలో పడ్డారు. 48 గంటల్లో ప్రమాదానికి సంబంధింని ప్రాథమిక దర్యాప్తు వివరాలు వెల్లడిస్తామని స్థానిక అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రమాదానికి గురైన భవన యజమానికిపై పలు కేసులు నమోదు చేసినట్టు అంతర్జాతీయ నివేదికలు తెలిపాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
