60 ఏళ్ల వృద్ధుడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం అతని కోసం అన్ని చోట్లా వెతుకుతోంది. చివరికి ఆ వృద్ధుడు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలుసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే కాదు.. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు. అసలు ఇలాంటివి జరుగుతాయా .. కలలో కూడా ఊహించని సంఘటన అంటూ ఆశ్చర్యపడ్డారు కూడా.. ఎందుకంటే 14 అడుగుల భారీ మొసలి కడుపులో వృద్ధుడు కనిపించాడు. మొసలి లోపల మృతదేహం లభ్యమైంది. అయితే పరిశోధకులకు లేదా వృద్ధుడిని వెదుకుతున్న బృందాలకు ఎలా తెలిసిందో తెలియదు. ఈ వింత ఘటన మలేషియాలోని తవావులో జరిగింది.
మొసలి కడుపు లోపల ఉన్న బాడీ పార్ట్స్ గుర్తింపు కోసం పంపించగా.. అవి తాము వెదుకుతున్న ఆది బంగ్సా కు చెందినవి అని నిర్ధారించారు. మొసలి తల నరికిన సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నారని తవౌ ఫైర్ అండ్ రెస్క్యూ స్టేషన్ చీఫ్ జెమిషిన్ ఉజిన్ ధృవీకరించారు. మొసలి కడుపులోకి వృద్ధుడి అవశేషాలను వెలికితీయడానికి ముందు దానిని కాల్చి చంపారు. అనంతరం దాని కడుపులోని అవశేషాలు వెలికితీశారు. తరువాత తప్పిపోయిన రైతు ఆది బంగ్సాకి చెందినవి అని నిర్ధారించచారు.
వృద్ధుడు ఆది బంగ్సా గురించి వెదుకుతున్న నాల్గవ రోజున మగ ఎలిగేటర్ ఎరను మింగినట్లు జూ కి చెందిన ఓ వక్తి ద్వారా ఆది బంగ్సాను వెదుకుతున్న బృందానికి సమాచారం అందింది. ఇదే విషయాన్ని చీఫ్ ఉజిన్ ధృవీకరించారు. తమ విచారణలో జంతువు ఆ రైతుని మింగినట్లు నిర్ధారణ అయింది.. బంగ్సా మరణంలో దాని ప్రమేయం చెప్పారు.
మొసలి బరువు 126 కిలోలు
జూలై 22 శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మొసలిని కాల్చి చంపారు. కొన్ని గంటల తర్వాత దాని కడుపు తెరిచారు. ఆది బంగ్సా ను చూడడానికి ఈ సమయంలో అతని కుటుంబం మొత్తం అక్కడే ఉంది. 126 కిలోల బరువు, 14 అడుగుల పొడవు ఉన్న మొసలి మృతదేహాన్ని వెలికితీసిన తర్వాత శోధన బృందం చేపట్టిన ఆపరేషన్ ఉదయం 11 గంటలకు ముగిసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..