AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్లిమ్ అయిన కిమ్…. వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో… ఇంటర్నెట్ షేక్ …!’నిజంగానేనా’ ..?

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గి సన్నబడ్డారని ఆ మధ్య వార్తలు వస్తే చాలామంది అది నమ్మలేదు. తమ దేశంలో ఆహార కొరత ఉందని చెప్పిన కిమ్...

స్లిమ్ అయిన కిమ్.... వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో... ఇంటర్నెట్ షేక్ ...!'నిజంగానేనా' ..?
Kim
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 28, 2021 | 11:44 AM

Share

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గి సన్నబడ్డారని ఆ మధ్య వార్తలు వస్తే చాలామంది అది నమ్మలేదు. తమ దేశంలో ఆహార కొరత ఉందని చెప్పిన కిమ్… నిజంగానే బరువు తగ్గారా అని వారు సందేహించారు. పాత ఫోటోలను.. తాజా ఫోటోలను పక్కన పెట్టి పోల్చి మరీ చూశారు. దాదాపు చిన్న సైజు అధ్యయనమే చేశారు. కానీ మరీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ వీడియో చూసి ఈయన స్లిమ్ గా ఉండడం చూసి నిజాన్ని ఒప్పుకున్నారు. 37 ఏళ్ళ ఈ నేత చాలావరకు వెయిట్ లాస్ అయినట్టు కనిపిస్తున్నాడని అనడమే కాదు.. వైట్ షర్ట్ ధరించి సాదాసీదా దుస్తులతో కనబడిన ఆయనను చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. తన పార్టీ సహచరులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అటెండ్ అయిన కిమ్ గారి దృశ్యాలను నార్త్ కొరియా వాసులు ఓ పెద్ద టీవీ స్క్రీన్ లో చూసి ఆశ్చర్యపోవడమే కాదు… అసలు ఈ క్లిప్ ని తాము వెరిఫై చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారట…

ఈ సమావేశ వివరాలు ఏమిటో కూడా తెలియవవని వారు నిట్టూర్చారు. సామాన్యంగా ప్రభుత్వ పూర్తి స్థాయి వివరాలను అక్కడి వార్తా పత్రికలు ఇవ్వడానికి సాహసించవు.. పరోక్షంగా సెన్సార్ కోడ్ అమల్లో ఉంటుందట.. మొత్తానికి ఆదివారం నాడు స్టేట్ మీడియా ప్రసారం చేసిన ఈ వీడియోను లక్ష మందికి పైగా చూసి వావ్ అంటే.. ఇక కామెంట్లకు లెక్కే లేదు.. నెట్ యూజర్లు తమకు తోచిన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. డైట్ బాగా తగ్గించేసినట్టున్నారు గురువు గారు అని ఒకరు సెటైరిక్ గా అంటే.. మరొకరు..పాపం.. నిజంగానే దేశంలో ఆహార కొరత బాగా ఉన్నట్టుంది ..అందుకే కిమ్ స్లిమ్ అయ్యారు అని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నాడు నిమ్మరసం, ఐస్ క్రీమ్ అమ్మిన మహిళ నేడు ఎస్ఐ… కేరళలో మారిన ఆమె జీవిత గమ్యం

Mega Young Heroes: చిన్నతనం నుంచి ఏమీ మారలేదంటూ మెగా యంగ్ హీరోల సెల్ఫీ .. సోషల్ మీడియాలో వైరల్ ..

Follow Us