Kim Jong Un: ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత.. కిమ్ సంచలన నిర్ణయం
ఉత్తర కొరియాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆత్మహత్యలు అడ్డుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

ఉత్తర కొరియాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఆత్మహత్యలు అడ్డుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యలను సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహం అంటూ అభిప్రాయపడ్డారు. స్థానిక అధికారులు తమ ప్రాంత పరిధిలో ఉండే ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకోవాలని సూచించారు. ఒకవేళ ఈ విషయంలో అధికారులు విఫలమైతే మీరు కూడా బాధ్యత వహించాసల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఉత్తరకొరియా ఈశాన్య ప్రాంతంలో హామ్‌యాంగ్‌కు చెందిన ఓ అధికారి రేడియో ఫ్రీ ఆసియా సంస్థతో మాట్లాడుతూ.. ప్రతి ప్రావిన్స్ పార్టీ మీటింగ్‌లో వివిధ నాయకులకు కిమ్ ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకొన్న వారి వివరాలు కూడా వెల్లడిస్తున్నారని చెప్పారు. ఈ వివరాలు తెలుసుకొని మీటింగ్‌కు హాజరైన వారు కూడా ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. ఇక ర్యాంగాంగ్ ప్రావిన్స్‌లో ఆకలి చావుల కంటే ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆర్‌ఎఫ్ఏ తెలిపింది. కిమ్ జోంగ్ ఉన్ అదేశాలైతే జారీ చేసినప్పటికీ.. వాటిని ఎలా అడ్డుకోవాలనే ప్రణాళికలు మాత్రం అధికారుల వద్ద లేవని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఉత్తరకొరియాలో అత్యధికంగా పేదరికం, ఆకలి కారణంగానే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..