అమెరికాలో మనోళ్ళదే హవా.. సెనెటర్‌గా హైదరాబాదీ
ఒకప్పుడు పొట్టకూటి కోసం.. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్ళే వారు భారతీయులు. ఈ వలసలు 90వ దశకం నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. ట్రంప్ అనే అడ్డుగోడ రాకపోతే.. భారతీయుల డెస్టినేషన్ అమెరికా తప్ప మరే కంట్రీ పెద్దగా వుండేది కాదు.. కానీ అదే కంట్రీలో ఇప్పుడు భారతీయులు రాజకీయాల్లో రాణిస్తూ తామేమీ తక్కువ కాదని చాటుతున్నారు. తాజాగా నలుగురు భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యంలో కీలక పదవులకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరు ముస్లిం మహిళ కావడం […]
ఒకప్పుడు పొట్టకూటి కోసం.. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం అమెరికా వెళ్ళే వారు భారతీయులు. ఈ వలసలు 90వ దశకం నుంచి విపరీతంగా పెరిగిపోయాయి. ట్రంప్ అనే అడ్డుగోడ రాకపోతే.. భారతీయుల డెస్టినేషన్ అమెరికా తప్ప మరే కంట్రీ పెద్దగా వుండేది కాదు.. కానీ అదే కంట్రీలో ఇప్పుడు భారతీయులు రాజకీయాల్లో రాణిస్తూ తామేమీ తక్కువ కాదని చాటుతున్నారు.
తాజాగా నలుగురు భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యంలో కీలక పదవులకు ఎన్నికయ్యారు. వారిలో ఒకరు ముస్లిం మహిళ కావడం విశేషం. మరో వైట్ హౌజ్ మాజీ సాంకేతిక విధాన సలహాదారు కూడా ఉన్నారు. గజాలా హష్మీ వర్జీనియా స్టేట్ సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే, ఒబామా హయాంలో శ్వేత సౌధంలో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్‌గా విధులు నిర్వహించిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గజాలా హష్మీ తొలిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
గజాలా హష్మీ పూర్వీకులు హైదరాబాద్‌కు చెందిన వారు కావడం గమనార్హం. గజాలా హష్మీకి నాలుగేళ్ళ వయస్సున్నప్పుడు వారి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి అమెరికాకు వలస వెళ్ళింది. ఇటీవల సెనెట్‌కు పోటీ చేసిన గజాలా హష్మీ.. రిపబ్లికన్ పార్టీకి చెందిన సిట్టింగ్ సెనెటర్ గ్లెన్ సెర్టెవెంట్‌పై ఘన విజయం సాధించారు. వర్జీనియాకు చెందిన 10వ సెనెట్ డిస్ట్రిక్ట్ నుంచి సెనెటర్‌గా గెలిచిన 55 ఏళ్ళ గజాలా హష్మీ డెమెక్రాట్ పార్టీకి చెందిన వారు.
ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజ్‌లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా గజాలా పనిచేస్తున్నారు. భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉండే లావుడన్ కౌంటీ నుంచి వర్జీనియా ప్రతినిధుల సభకు సుహాస్ సుబ్రమణ్యం ఎన్నికయ్యారు. 1979తో బెంగళూరుకు చెందిన వైద్యురాలైన తన తల్లితో కలిసి అమె అమెరికా వెళ్లారు. మరోవైపు, కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్ మనోహర్ రాజు శాన్ ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు. అలాగే, నార్త్ కరొలినాలో చార్లట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా మరోసారి ఎన్నికయ్యారు.