Johnnie Moore: ఒబామా.. భారత్‌ను విమర్శించడం మానుకోండి.. USCIRF మాజీ కమిషనర్‌ సూచన..

|

Jun 26, 2023 | 12:09 PM

Johnnie Moore on Barack Obama: భారతీయ ముస్లింల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై భారత్ తోపాటు.. అమెరికాలో సైతం అభ్యంతరం వ్యక్తంమవుతోంది.

Johnnie Moore: ఒబామా.. భారత్‌ను విమర్శించడం మానుకోండి.. USCIRF మాజీ కమిషనర్‌ సూచన..
Johnnie Moore
Follow us on

Johnnie Moore on Barack Obama: భారతీయ ముస్లింల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై భారత్ తోపాటు.. అమెరికాలో సైతం అభ్యంతరం వ్యక్తంమవుతోంది. అంతర్జాతీయ మతస్వేచ్ఛ, భారత్ లో ముస్లింల హక్కుల గురించి బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ యుఎస్ కమిషన్ మాజీ కమిషనర్ జానీ మూర్ స్పందించారు. భారతదేశాన్ని విమర్శించడం మానుకోవాలంటూ సూచించారు. భారత్ అత్యంత వైవిధ్యమైన దేశమని.. వైవిధ్యమే దాని బలమని జానీమూర్ పేర్కొన్నారు.

జానీ మూర్ మాట్లాడుతూ.. “మాజీ అధ్యక్షుడు (బరాక్ ఒబామా) భారతదేశాన్ని విమర్శించడం కంటే భారతదేశాన్ని మెచ్చుకోవడం కోసం తన శక్తిని వెచ్చించాలని నేను భావిస్తున్నాను. మానవ చరిత్రలో భారతదేశం అత్యంత వైవిధ్యమైన దేశం. అమెరికా పర్ఫెక్ట్ దేశం కానట్లే ఇది పర్ఫెక్ట్ దేశం కాదు.. కానీ దాని వైవిధ్యమే దాని బలం.. ఆ విమర్శలో కూడా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రధాని మోడీని అభినందించకుండా ఉండలేకపోయారు.. ఆయనతో కొంత సమయం గడిపినందుకు నేను ఖచ్చితంగా దీనిని అర్థం చేసుకున్నాను.’’ అంటూ జానీ మూర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంలో ఒబామా ఓ అంతర్జాతీయ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ప్రధాని మోడీతో మాట్లాడితే.. భారత్‌లోని మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావిస్తాను.. వారి హక్కులను పరిరక్షించలేకపోతే.. భారత్‌ మున్ముందు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.. అంటూ మాట్లాడతానని పేర్కొన్నారు. కాగా.. ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫైర్ అయ్యారు. ఆయన హయాంలోనే.. ముస్లిం దేశాలపై బాంబు దాడులు ఎక్కువగా జరిగాయన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..