President Emmanuel Macron: ఎత్తిన బీరు సీసా దించకుండా తాగేసిన దేశాధ్యక్షుడు.. వీడియో వైరల్.
ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనందం పట్టలేక ఆయన చేసిన పని విమర్శలపాలు చేసింది. స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో ఈసారి టౌలౌస్ రగ్గీ జట్టు విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ జాతీయ రగ్బీ చాంపియన్ నెగ్గి టౌలౌస్ టీమ్ డ్రెస్సింగ్ రూంలో సంబరాలు జరుపుకుంది.
ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనందం పట్టలేక ఆయన చేసిన పని విమర్శలపాలు చేసింది. స్టేట్ డి ఫ్రాన్స్ టోర్నీలో ఈసారి టౌలౌస్ రగ్గీ జట్టు విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ జాతీయ రగ్బీ చాంపియన్ నెగ్గి టౌలౌస్ టీమ్ డ్రెస్సింగ్ రూంలో సంబరాలు జరుపుకుంది. అయితే ఈ వేడుకల్లో ఓ విశిష్ట వ్యక్తి ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మేక్రాన్ కూడా పాల్గొన్నారు. టౌలౌస్ జట్టు అభిమాని అయిన మేక్రాన్… జట్టుతో పాటు డ్రెస్సింగ్ రూంలోకి వచ్చి ఆనందంగా గడిపారు. ఆటగాళ్లు ఉత్సాహంతో కేరింతలు కొడుతుండగా ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా! అంతవరకు బాగానే ఉంది. దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి. మద్యాన్ని అధ్యక్షుడే ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అధ్యక్షుడు… ఇలా బీరు కొట్టడం ద్వారా ప్రజలను తప్పుడు మార్గంలోకి ప్రోత్సహిస్తున్నాడని మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

