Shocking: 800 ఏళ్లనాటి మమ్మీని బ్యాగ్‌లో పెట్టుకు తిరుగుతున్న డెలివరీ బాయ్! ఆరా తీయగా ఖాకీలకే షాక్..!
800-Year-Old Mummy: అతనో ఫుడ్ డెలివరీ బాయ్.. కస్టమర్లు కోరుకున్న చోటికి ఫుడ్ డెలివరీ చేయడం ఆ యువకుడి పని. అనుమానంతో ఓరోజు డెలివరీ బాయ్ బ్యాగ్ తెరిచి చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు.
అతనో ఫుడ్ డెలివరీ బాయ్.. కస్టమర్లు కోరుకున్న చోటికి ఫుడ్ డెలివరీ చేయడం ఆ యువకుడి పని. అనుమానంతో ఓరోజు డెలివరీ బాయ్ బ్యాగ్ తెరిచి చూసిన పోలీసులు నిర్ఘాంతపోయారు. తన డెలివరీ బ్యాగ్‌లో 800 ఏళ్ల కిందటి మమ్మీని పెట్టుకుని తిరుగుతున్నాడు ఆ యువకుడు. సంచలన సృష్టించిన ఈ ఘటన పెరూలో వెలుగు చూడగా.. ఆ యువకుడు చెప్పిన సమాధానంతో మరింత షాక్ అయ్యారు పోలీసులు. ఇంతకీ అతను ఏం చెప్పాడు? పోలీసులు ఎందుకు షాక్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..
పునో ప్రాంతానికి చెందిన జూలియో సీజర్ బెర్మెజో అనే 26 ఏళ్ల యువకుడు కొంతకాలం ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసి మానేశాడు. గత కొన్నిరోజులుగా ఇతడు తన పాత డెలివరీ బ్యాగులో ఓ మమ్మీని పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు. అయితే రాత్రి రోడ్డు పక్కన స్నేహితులతో ఉన్న జూలియో బ్యాగును అనుమానంతో తనిఖీ చేసిన పెట్రోలింగ్ పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడించాడా యువకుడు
30 ఏళ్ల క్రింత ఆ మమ్మీని తన తండ్రి తీసుకొచ్చాడని చెప్పాడు జూలియో. మమ్మీని తన స్నేహితులకు చూపించేందుకు తెచ్చానని పోలీసులకు వివరించాడు. మమ్మీతో తనకు బాగా అలవాటైపోయిందని జూలియో తెలిపాడు. ఇంట్లో కూడా దాన్ని పక్కనే పెట్టుకొని నిద్రపోతాడట. ఆ మమ్మీ తన ఆధ్యాత్మిక ప్రేయసి అంటూ చెప్పడంతో కంగుతినడం పోలీసుల వంతైంది. మమ్మీని పురావస్తుశాఖ అధికారులు పరిశీలించగా.. అది సుమారు 800 ఏళ్ల కిందటి 45 ఏళ్ల పురుషుడిదని తేలినట్టు సమాచారం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..