Israeli: ఘాజియా తీర ప్రాంతంలో ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా హెచ్చరిక

|

Feb 21, 2024 | 8:56 AM

లెబనాన్‌లోని ఘాజియా పట్టణ తీర ప్రాంతంలో ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే భారీ నష్టం వాటిల్లిందని లెబనాన్‌ వర్గాల ద్వారా తెలిసింది. దాడిపై స్పందించిన ఇజ్రాయిల్‌ తాము హిజ్బుల్లా ఆయుధ డిపోలపై దాడి చేశామని తెలిపింది.

Israeli: ఘాజియా తీర ప్రాంతంలో ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడులు.. ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా హెచ్చరిక
Israeli Drone Strikes
Follow us on

తమ దేశంలో హమాస్ ఉగ్రవాదులు దాడులు జరపడంతో ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతూనే ఉంది. లెబనాన్‌లోని ఓ పట్టణంపై ఇజ్రాయిల్‌ సైన్యం ఎయిర్‌ స్ట్రైక్స్‌ జరిపింది. తాజా వైమానిక దాడులను హిజ్బుల్లా దాడికి ప్రతిదాడిగా అభివర్ణించింది ఇజ్రాయిల్‌ ఆర్మీ.

లెబనాన్‌లోని ఘాజియా పట్టణ తీర ప్రాంతంలో ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే భారీ నష్టం వాటిల్లిందని లెబనాన్‌ వర్గాల ద్వారా తెలిసింది. దాడిపై స్పందించిన ఇజ్రాయిల్‌ తాము హిజ్బుల్లా ఆయుధ డిపోలపై దాడి చేశామని తెలిపింది. తమ భూభాగంలోని షెబా సరిహద్దు ప్రాంతంలో హిజ్బుల్లా చేసిన దాడులకు తాము ప్రతిదాడులు జరుపుతున్నామని ఇజ్రాయిల్ ఆర్మీ స్పష్టం చేసింది. మరోవైపు ఇజ్రాయిల్‌ ఎయిర్‌ స్ట్రైక్స్‌పై హిజ్బుల్లా ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇజ్రాయిల్ సైన్యం ఓ ఎలక్ట్రికల్‌ జనరేటర్స్‌ తయారీ ఫ్యాక్టరీపై వైమానిక దాడులు జరిపిందని బీరుట్‌ వర్గాలు తెలిపాయి.

గత ఏడాది అక్టోబర్‌ ఏడున గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్య ప్రారంభించిన నాటి నుంచీ లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయిల్‌పై దాడులు జరుపుతునే ఉంది. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్య ఆగేవరకూ తాము పోరాడుతునే ఉంటామని హిజ్బుల్లా ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌-ఇజ్రాయిల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా, సామాన్య పౌరుల మరణాలు సంభవించకుండా చూసేందుకు యత్నాలు కొనసాగుతున్నాయని బీరుట్‌ వర్గాల ద్వారా తెలిసింది.

ఇవి కూడా చదవండి

గతవారం ఇజ్రాయిల్ ఆర్మీ హిజ్బుల్లాకు చెందిన కమాండర్‌ను, అతడి సహచరులను నబతీ పట్టణంలో మట్టుబెట్టింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా హెచ్చరించింది. తాము తలుచుకుంటే ఇజ్రాయిల్‌లోని ఏ భాగంలోనైనా క్షిపణి దాడులు చేయగలమని వార్నింగ్‌ ఇచ్చింది. ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇప్పటివరకూ హిజ్బుల్లాకు చెందిన 200 మంది ఫైటర్లు హతమయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..