AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ceasefire: హమ్మయ్య.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్.. ట్రంప్ ఎంట్రీ తర్వాత..

యుద్ధం ముగిసింది. ప్రళయం తప్పింది. వార్‌ వైరస్‌ పశ్చిమాసియా మొత్తాన్ని చుట్టేస్తుందని.. భయపడుతున్న తరుణంలో చివరికి తెల్లజెండా ఎగిరింది. ట్రంప్‌ ప్రకటనలతో 11రోజుల యుద్ధానికి తెరపడింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ అంగీకారించాయి.. 11రోజుల యుద్ధం ముగిసినట్లు ఇరాన్‌ అధికారిక ఛానల్‌ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది.

Ceasefire: హమ్మయ్య.. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్.. ట్రంప్ ఎంట్రీ తర్వాత..
Us In Israel Iran War
Shaik Madar Saheb
|

Updated on: Jun 24, 2025 | 11:23 AM

Share

యుద్ధం ముగిసింది. ప్రళయం తప్పింది. వార్‌ వైరస్‌ పశ్చిమాసియా మొత్తాన్ని చుట్టేస్తుందని.. భయపడుతున్న తరుణంలో చివరికి తెల్లజెండా ఎగిరింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య బాంబులవర్షం కురుస్తుండగానే అమెరికా ఎంట్రీతో వార్‌ కొత్త టర్న్‌ తీసుకుంది. నేరుగా ఇరాన్‌ అణుకేంద్రాలపై అమెరికా దాడికి దిగింది. దీంతో 48గంటల్లోనే అమెరికాపై ప్రతీకారదాడికి దిగింది ఇరాన్‌. ఖతార్‌లోని అమెరికా సైనికస్థావరంపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. దీంతో పశ్చిమాసియాలోని మరికొన్ని దేశాలు యుద్ధంలోకి దిగడం అనివార్యమనుకున్నారు. కానీ ట్రంప్‌ ప్రకటనలతో 11రోజుల యుద్ధానికి తెరపడింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ అంగీకారించాయి.. 11రోజుల యుద్ధం ముగిసినట్లు ఇరాన్‌ అధికారిక ఛానల్‌ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ఇరాన్‌ అధికారికంగా ప్రకటించింది. యుద్ధం ముగిసిందంటూ ట్రంప్‌ ఇప్పటికే పోస్ట్‌చేశారు. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై దాడి తర్వాత ట్రంప్ ప్రకటన చేశారు.

అయితే.. ట్రంప్‌ ప్రకటన తర్వాత కూడా టెల్‌అవీవ్‌పై ఇరాన్‌ మిసైల్‌ ఎటాక్‌కి దిగింది. ఒప్పందానికి ముందు చివరి క్షిపణి ప్రయోగించామంది ఇరాన్‌. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి సీజ్‌ ఫైర్‌కి రెండు దేశాలు అంగీకరించినట్లే. అయితే లక్ష్యం నెరవేరేదాకా ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ఆగదన్న ఇజ్రాయెల్‌ ప్రధాని ఏం చేయబోతున్నారు? అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఇరాన్‌పై ఎలాంటి ఒత్తిడి తెస్తారో చూడాల్సి ఉంది.

అసలు ఇరాన్‌ దాడుల నుంచి ట్రంప్‌ కాల్పుల విరమణ వరకు ఏం జరిగింది? ఎలాంటి చర్చలు నడిచాయి? ఇప్పుడు ఇవే ఆసక్తిగా మారాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు మధ్యవర్తిగా ట్రంప్‌ వ్యవహరించారు., ఇందుకోసం ఖతార్‌ సాయం తీసుకున్నారు ట్రంప్‌..

దాడులపై ఖతార్‌కు ముందే సమాచారం ఇచ్చారు ఇరాన్‌ అధికారులు.. తద్వారా అమెరికా దాడులకు ఇరాన్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఇరాన్‌ ఇచ్చిన సమాచారం ప్రాణనష్టాన్ని నివారించింది. ఈ విషయంలో ఇరాన్‌కు ట్రంప్‌ అభినందనలు తెలిపారు. తర్వాత ఇజ్రాయెల్‌, ఖతర్‌ దేశాధినేతలతో ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణకు నెతన్యాహు అంగీకరించినట్లు ఖతార్‌ ప్రధాని అల్‌ థానీకి చెప్పారు ట్రంప్‌.. ఈ విషయాన్ని ఇరాన్‌కు వివరించాలని కోరారు ట్రంప్‌.. వెంటనే ఇరాన్‌ అధికారులతో మాట్లాడారు ఖతార్‌ ప్రధాని.. ఖతార్‌ దాడుల తర్వాత శాంతి ప్రయత్నాలు వేగంగా సాగాయి.. ట్రంప్‌ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి ప్రకటించారు. అయితే.. కానీ చివరకు ఇరాన్‌ కూడా యుద్ధం ఆగినట్లు తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి