Israel Hamas War: ఇజ్రాయెల్‌కు భారత్‌ షాక్.. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఓటు..

|

Nov 13, 2023 | 7:25 AM

హమాస్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ కు భారత్ అండగా నిలిచింది. అయితే తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ ఓటేసింది. మరోవైపు ఉత్తర గాజాపై హమాస్‌ పట్టు కోల్పోయిందని, త్వరలో బందీలకు విముక్తి కల్పిస్తామని ప్రకటించారు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.

Israel Hamas War: ఇజ్రాయెల్‌కు భారత్‌ షాక్.. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానానికి ఓటు..
Israel Hamas War
Follow us on

ఇజ్రాయెల్‌కు భారత్‌ షాకిచ్చింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటువేసింది. పాలస్తీనాతో పాటు సిరియా లోని న గోలాన్‌ హైట్స్‌లో ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌లు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా.. 18 దేశాలు తటస్థ వైఖరి తీసుకొన్నాయి. ఇక కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్‌, మార్షల్‌ఐలాండ్స్‌, ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియా, నౌరు, అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి.

మరోవైపు ఉత్తరగాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హమాస్‌ను అంతం చేసి బందీలను కాపాడుతామని తెలిపారు. ఇప్పటికే ఐడీఎఫ్‌ దళాలు గాజాను, అల్‌-షిఫా ఆస్పత్రిని చుట్టుముట్టాయి. హమాస్‌ ఉత్తరగాజాపై నియంత్రణ కోల్పోయిందని, దాక్కోవడానికి వారికి సురక్షితమైన ప్రదేశమే లేదన్నారు. చివరి హమాస్‌ తీవ్రవాదిని మట్టుబెట్టే వరకూ ఆపరేషన్‌ కొనసాగుతుందని నెతన్యాహూ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ లక్ష్యమే బందీలను విడిపించడమని ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పారు.

గత 16 ఏళ్లలో గాజాను హమాస్‌ సర్వనాశనం చేసిందన్నారు. అక్కడి ప్రజలకు రక్తం, పేదరికం మినహా మరేమీ మిగలకుండా చేసిందన్నారు. గాజాలోని అల్‌ షిఫా ఆస్పత్రితో సంబంధాలు తెగిపోయాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు వెల్లడించారు. గాజాలో ఇదే అతిపెద్ద ఆస్పత్రి. ఇక్కడి సిబ్బంది, పేషెంట్ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో తీవ్ర ఆందోళన చెందుతోందని ఆ సంస్థ అధిపతి ట్రెడ్రోస్‌ పేర్కొన్నారు. తక్షణ కాల్పుల విరమణ ప్రకటించి మానవతా సాయం చేయాలని కోరారు. ఓ ఆసుపత్రిలో ఉన్న దాదాపు 1,000 మందిని బందీలుగా మార్చుకొన్న ఘటనలో కీలక నిందితుడైన హమాస్‌ కమాండర్‌ అహ్మెద్‌ సియామ్‌ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..