AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NED: ప్రపంచకప్‌లో తొలి సెంచరీ బాదిన శ్రేయాస్ అయ్యర్.. కేఎల్ రాహుల్‌తో రికార్డ్ భాగస్వామ్యం..

Shreyas Iyer: ప్రపంచకప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ అందించింది. బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. తేజ నిడమనూరు, లోగన్ వాన్ బీక్ క్రీజులో ఉన్నారు.

IND vs NED: ప్రపంచకప్‌లో తొలి సెంచరీ బాదిన శ్రేయాస్ అయ్యర్.. కేఎల్ రాహుల్‌తో రికార్డ్ భాగస్వామ్యం..
Kl Rahul, Shreyas Iyer
Venkata Chari
|

Updated on: Nov 12, 2023 | 9:02 PM

Share

ఆదివారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరుగుతోన్న CWC 2023 మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన తొలి ODI ప్రపంచ కప్ సెంచరీని సాధించాడు.

అయ్యర్ తన నాల్గవ ODI సెంచరీ కోసం 84 బంతులు ఆడాడు. ఈ సెంచరీతో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసేందుకు కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో భారత్ రెండవ అత్యధిక ODI ప్రపంచ కప్ స్కోర్‌ను సాధించింది. ఈ ఫార్మాట్‌లో నాల్గవ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ కప్‌లలో అత్యంత వేగంగా 62 బంతుల్లో శతకం బాదిన కేఎల్ రాహుల్‌తో కలిసి శ్రేయాస్ అయ్యర్ నాలుగో వికెట్‌కు 208 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో వీరిద్దరి భాగస్వామ్యం నాలుగో వికెట్‌కు అత్యధికంగా నిలిచింది.

మ్యాచ్ పరిస్థితి..

ప్రపంచకప్ 2023లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ అందించింది. బెంగళూరులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. నంబర్-4 శ్రేయాస్ అయ్యర్ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించగా, ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ రెండో సెంచరీ సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ ఆడారు. లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, పాల్ వాన్ మీకెరెన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

అనంతరం నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. తేజ నిడమనూరు, లోగన్ వాన్ బీక్ క్రీజులో ఉన్నారు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కీపర్/కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌