AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World War III: వింత దశలో కనిపిస్తున్న ప్రపంచం – గందరగోళానికి గురిచేస్తున్న నాయకులు

ప్రపంచం ఒక వింత దశలో ఉంది. ప్రతీ పెద్ద నాయకుడు, ప్రతి శక్తివంతమైన దేశం గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో నిర్ణయాత్మక యుద్ధం చేస్తున్న పుతిన్.. రక్షణ బడ్జెట్‌ను తగ్గించడం గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ కొన్నిసార్లు జెలెన్స్కీని బెదిరిస్తారు.. మరికొన్నిసార్లు రష్యా తమ ఫ్రెండ్‌ అని సంబోధిస్తారు. ఇరాన్ పని అయిపోయిందని నెతన్యాహు చెబుతారు.. ఇటు ఖమేనీ మునుపటి కంటే శక్తివంతుడిని అయ్యానంటారు. మరోవైపు, నాటో కొన్నిసార్లు ట్రంప్‌ను వ్యతిరేకిస్తుంది, ఇంకొన్నిసార్లు అతనితో గొంతు కలుపుతుంది. దీనికి అర్ధం ఏంటి? వారంతా ఇంకేదో చెబుతున్నారు... సీక్రెట్‌గా ఏదో చేస్తున్నారు. ప్రతి నాయకుడి ముఖం.. అందరి ముందు ఒకలా.. అద్దంలో మరోలా కనిపిస్తోంది. వారి నాలుక బయట ఒకటి.. చర్చల్లో మరోటి పలుకుతూ.. ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తోంది. నిజం చెప్పాలంటే సత్యానికి, భ్రమకు మధ్య తేడా ఏంటనేది అర్థం కావట్లేదు.

World War III: వింత దశలో కనిపిస్తున్న ప్రపంచం - గందరగోళానికి గురిచేస్తున్న నాయకులు
World War III
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2025 | 9:17 PM

Share

మిసైళ్లు..  ఘోరమైన బాంబులు…  విధ్వంసక చిత్రాలు.. భ్రమ అనే సిరాతో లిఖించబడుతున్న మూడో ప్రపంచ యుద్ధ స్క్రిప్ట్‌లో భాగమా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నాయకులు ఒకరినొకరు గందరగోళానికి గురిచేస్తున్నారు. రష్యా, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, వీటితోపాటు NATO… ప్రతి ఒక్కరూ.. మిగిలిన దేశాలను గందరగోళానికి గురిచేస్తుండడం.. పచ్చి అబద్ధమో.. భయానక నిజమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అందరూ గందరగతోళ ప్రకటనలు.. అందుకు విరుద్ధంగా వారి చేష్టలుంటున్నాయి. ముందుగా వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో నిర్ణయాత్మక యుద్ధం చేస్తున్నారు, కానీ ఆయన రక్షణ బడ్జెట్‌ను తగ్గిస్తానని కూడా చెబుతున్నారు. ఇది శాంతికి సంకేతమా… లేదా తెరవెనుక పెద్ద జరుగుతున్న గేమా? డొనాల్డ్ ట్రంప్ ప్రతి ప్రకటనా కొత్త పజిలే. ఈరోజు ఆయన ఒకటి చెబుతారు, రేపు దానికి విరుద్ధంగా చేస్తారు. ఇలా ప్రపంచం ఆ చట్రంలో చిక్కుకుపోతుంది. బెంజమిన్ నెతన్యాహు, కొన్నిసార్లు తాను ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేశానని చెబుతారు. ఇప్పుడు అదే నెతన్యాహు ఖమేనీ నుంచి యురేనియంను అడుగుతున్నానని ప్రకటన చేస్తారు. అణు బాంబు శాంతికి అవసరమని చెప్పిన ఆయతొల్లా అలీ ఖమేనీ… ఇప్పుడు దానిని ఎలాగైనా పొందాలనుకోవడం ఆయన లక్ష్యంగా మారింది. ఇక నాటో.. ట్రంప్‌ను యూరప్ శత్రువు అని పిలిచిన నాటో, ఇప్పుడు ఆయనను ‘డాడీ’ అని పిలుస్తోంది. మనం చెప్పుకుంటున్న పాత్రలన్నీ భిన్నమే అయినప్పటికీ.. వారంతా ఒకే స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. అది మరేదో కాదు.. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన స్క్రిప్ట్. ముందుగా, మాస్కోకు వెళ్దాం… అక్కడ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి