Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి

కుప్పకూలిన బంగారు గని, 11 మంది మృతి

Phani CH
|

Updated on: Jun 30, 2025 | 7:47 PM

Share

సూడాన్ ఈశాన్య ప్రాంతంలో ఓ బంగారు గని పాక్షికంగా కూలిపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో ఏడుగురు గాయపడ్డారని సూడానీస్‌ మినరల్‌ రిసోర్సెస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తూర్పు నైలు నది ప్రావిన్స్‌లోని హోయిడ్ పట్టణంలో గల కిర్ష్ అల్ ఫీల్ గనిలో ఈ దుర్ఘటన సంభవించింది.

బంగారు గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనతో గనిలో తవ్వకాలను నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. మృతులంతా మైనర్లు కావడం గమనార్హం. బంగారం ఉత్పత్తిలో సూడాన్‌ ప్రధానమైన దేశంగా ఉన్నప్పటికీ.. అంతర్యుద్ధం, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో ఇక్కడ గనులు కూలడం, కార్మికుల మరణాలు సర్వసాధారణం.. ఇప్పటికే గనుల ప్రమాదాల్లో వందలాది మరణించారు. సుడానీస్ ఖనిజ వనరుల కంపెనీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ఈశాన్య ఎర్ర సముద్రం రాష్ట్రంలోని SAF నియంత్రణలో ఉన్న అట్బారా – హైయా నగరాల మధ్య ఉన్న హోవీద్ మారుమూల ఎడారి ప్రాంతంలోని “కిర్ష్ అల్-ఫిల్ గనిలోని ఒక ఆర్టిసానల్ షాఫ్ట్”లో బంగారు గని కుప్పకూలిందని తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి.. 2023లో ఒక గని కూలిపోవడం వల్ల 14 మంది మైనర్లు మరణించగా, 2021లో మరొక గని కూలిపోవడం వల్ల 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా.. చాలా మంది ఆహారం లేక.. ఉపాధి కోసం మైనింగ్ పరిశ్రమలో పనిచేస్తుంటారు.. సూడాన్ లో సంక్షోభం నాటి నుంచి పదివేల మంది మరణించగా.. 13 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారని.. 4 మిలియన్లకు పైగా ప్రజలు దేశం దాటి వెళ్లిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం, SAF దేశంలోని ఉత్తర – తూర్పు ప్రాంతాలలో ఆధిపత్యం చెలాయిస్తోంది – విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం.. కానీ అత్యధిక జనాభా కలిగిన ఖార్టూమ్ – కొన్ని మధ్య ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. అదే సమయంలో, డార్ఫర్‌లోని ఎక్కువ భాగంతో సహా పశ్చిమ సూడాన్‌లో ఎక్కువ భాగాన్ని RSF ఆక్రమించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం.. ఎందుకో తెలుసా

మరో అల్పపీడనం.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు