మరో భారీ యుద్ధానికి అమెరికా సిద్ధం? బుబియాన్ దీవులే లక్ష్యంగా ఇరాన్ ఆపరేషన్..!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 37 రోజులు గడుస్తున్న వేళ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇప్పటివరకు క్షిపణులు, డ్రోన్ దాడులకే పరిమితమైన ఇరాన్, ఇప్పుడు నేరుగా భూతల దాడులకు తెగబడటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) కువైట్ భూభాగంలోకి చొరబడిందని కువైట్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలై 37 రోజులు గడుస్తున్న వేళ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇప్పటివరకు క్షిపణులు, డ్రోన్ దాడులకే పరిమితమైన ఇరాన్, ఇప్పుడు నేరుగా భూతల దాడులకు తెగబడటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా, ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) కువైట్ భూభాగంలోకి చొరబడిందని కువైట్ ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది.
కువైట్ రక్షణ శాఖ సమాచారం ప్రకారం, IRGC సాయుధ యోధులు కువైట్‌లోని అతిపెద్ద ద్వీపమైన బుబియాన్‌లోకి ప్రవేశించి భూతల ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కువైట్ సైన్యానికి, IRGC బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘర్షణలో ఒక కువైట్ సైనికుడు గాయపడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత, గల్ఫ్ దేశాల్లో ఒక భూతల దాడి జరగడం ఇదే మొదటిసారి.
సుమారు 333 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న బుబియాన్ ద్వీపం కువైట్ భద్రతకు గుండెకాయ వంటిది. వ్యూహాత్మక ప్రదేశం. ఇది పర్షియన్ గల్ఫ్ ప్రవేశ ద్వారం వద్ద ఉండటంతో రవాణా మార్గాలను నియంత్రించడానికి కీలకం. ఇక్కడ అమెరికా తన తాత్కాలిక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇదే ఇరాన్‌ను ఉసిగొల్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం విషయంలో తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అది కనీసం చదవడానికి కూడా యోగ్యంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ‘కాల్పుల విరమణ’ అనేది కేవలం పేరుకే ఉందని, అది వెంటిలేటర్‌పై ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ ఇరాన్‌పై మరో విడత భారీ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
యూఏఈ తర్వాత ఇరాన్‌కు కువైట్ ప్రధాన లక్ష్యంగా మారింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ దాదాపు 1,500 సార్లు కువైట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. తాజా చొరబాటుతో గల్ఫ్ దేశాల్లో అశాంతి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
