Iran-Israel Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. అమెరికా సంచలన ప్రకటన

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది.. శనివారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.. ఒక్కసారిగా.. ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి..

Iran-Israel Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. అమెరికా సంచలన ప్రకటన
Iran Israel Tensions

Updated on: Feb 28, 2026 | 1:13 PM

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది.. శనివారం ఉదయం ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి.. ఒక్కసారిగా.. ఇజ్రాయెల్‌ మిసైళ్లతో దాడులు నిర్వహించింది. ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోత మోగింది. ఇజ్రాయెల్ దాడుల్లో పలు ప్రాంతాల్లో భీకర వాతావరణం నెలకొంది.. పలు భవనాలు నేలమట్టమయ్యాయి.. అయితే.. ఇరాన్ పై జరిపిన దాడుల్లో.. ఇజ్రాయెల్ తోపాటు.. అమెరికా కూడా పాల్గొంది. ఇరాన్‌లో జరిగిన దాడిలో ఇజ్రాయెల్ తోపాటు అమెరికా కూడా పాల్గొందని.. దాడులు కూడా చేస్తోందని ఒక అమెరికా అధికారి వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు. దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం దేశ పౌరులను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. ఈ మేరకు టెల్ అవీవ్‌లో సైరన్లు మోగాయి..

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 30 ప్రాంతాల్లో మిసైల్‌ దాడులు నిర్వహించాయి. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా అటాక్‌ చేశాయి.. దీంతో సుప్రీం లీడర్‌ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. మళ్లీ బంకర్‌లోకి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ వెళ్లారు. ఇరాన్‌ డిఫెన్స్‌ సిస్టంపైనా ఇజ్రాయెల్‌ దాడులు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్‌ సిస్టమ్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌కు పదే పదే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చాయి అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు. ఈరోజు కూడా ఇరాన్‌ విషయంలో ట్రంప్‌ స్పందించారు. తమతో డీల్‌ కుదుర్చుకోవాలన్నారు ట్రంప్‌. ఇరాన్‌కు డెడ్‌లైన్‌ కూడా విధించారు. ఆ డెడ్‌లైన్‌ ముగియగానే ఇజ్రాయెల్‌ మిసైల్‌ దాడులకు దిగింది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. కొన్ని వారాల్లోనే.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.. శనివారం.. ఇజ్రాయెల్ ముందస్తు దాడిని ప్రారంభించింది. ఇది మధ్యప్రాచ్యాన్ని కొత్త సైనిక ఘర్షణలోకి నెట్టివేసింది.. పశ్చిమ దేశాలతో టెహ్రాన్ దీర్ఘకాలంగా కొనసాగుతున్న అణు వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. “ఇజ్రాయెల్ దేశానికి ముప్పును తొలగించడానికి ఇజ్రాయెల్ ఇరాన్‌పై ముందస్తు దాడిని ప్రారంభించింది” అని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు. దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ హెచ్చరించడంతో టెల్ అవీవ్‌లో సైరన్‌లు మోగించారు..


“చివరి కొన్ని నిమిషాల్లో, ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించబడ్డాయి.. రక్షిత ప్రదేశాలకు దగ్గరగా ఉండాలని సెల్యులార్ పరికరాలకు ముందస్తు సూచన హెచ్చరిక నేరుగా చేశారు. ఇజ్రాయెల్ దేశం వైపు క్షిపణులను ప్రయోగించే అవకాశం కోసం ప్రజలను సిద్ధం చేయడానికి ఇది ముందస్తు హెచ్చరికగా పేర్కొంటున్నారు. రక్షిత ప్రదేశాలకు దగ్గరగా ఉండాలని ప్రజలను అభ్యర్థించాలని ఐడిఎఫ్ నొక్కి చెబుతుంది” అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) ఒక ప్రకటనలో తెలిపాయి..

సురక్షితంగా ఉండండి..

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌ ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.. ఇప్పటికే, తమ తమ దేశ ప్రజలు ఇరాన్ వీడాలంటూ భారత్ సహా పలు దేశాలు ప్రకటనలు చేశాయి.

మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us