AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Dog Day 2021: నేడు అంతర్జాతీయ కుక్కల దినోత్సవం.. శునకాలతో ప్రయోజనాలు ఏమిటి..?

International Dog Day 2021: ప్రతి కుక్కుకు ఓ రోజు వస్తుందంటుంటాము. అదే ఈ రోజు. ప్రతి ఏడాది ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని జరుపుకొంటారు..

International Dog Day 2021: నేడు అంతర్జాతీయ కుక్కల దినోత్సవం.. శునకాలతో ప్రయోజనాలు ఏమిటి..?
International Dog Day 2021
Subhash Goud
|

Updated on: Aug 26, 2021 | 12:07 PM

Share

International Dog Day 2021: ప్రతి కుక్కుకు ఓ రోజు వస్తుందంటుంటాము. అదే ఈ రోజు. ప్రతి ఏడాది ఆగస్టు 26న అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని జరుపుకొంటారు. మరి కుక్కల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.

రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి, కుక్కల దత్తత గురించి అవగాహన పెంచేందుకే ఈరోజు వచ్చింది. 2004లో కొలీన్ పైజ్ అనే ఒక రచయిత ఇందుకు బీజం వేశారు. జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఈయన నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్పీ డే కోసం చాలా కృషి చేశారు. ఇందుకే అంతర్జాతీయ కుక్కల దినోత్సవాన్ని ఇలా జరుపుకుంటారు. అత్యంత విశ్వాసం గల జంతువుల్లో కుక్క మాత్రమే.

శునకాల వల్ల ప్రయోజనాలివే..

శునకాలకు గ్రామ సింహం అనే మరో పేరు ఉంది. ఇవి గ్రామంలో ఉంటే దొంగలకు భయం. కుక్కలు ఎక్కువగా అరుస్తున్నాయంటే దొంగలు వచ్చినట్లుగా అనుమానించాల్సిందే. లేక ఇంకేవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లు భావిస్తుంటారు. ఇక ఎక్కడైనా బాంబులు పెట్టినట్లయితే వాటిని గుర్తించడంలో శునకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఏదైనా హత్య లేదా ఇతర సంఘటనలకు సంబంధించి పోలీసులకు క్లూలు సైతం అందిస్తాయి. శునకాల వల్ల పోలీసు శాఖకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటి ద్వారా ఎన్నో హత్య కేసులు, ఇతర కేసులను చేధించారు. ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.

మీరు స్కూలుకో లేదా కాలేజీకో లేదా ఆఫీసుకో ఇంకా ఏదైనా వేరేచోటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక మీలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపేందుకు ఎదురుచూసే ఏకైక వ్యక్తి మీ శునకం. కుక్కతో కాసేపు ఆడుకోగానే ఉల్లాసం వస్తుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శునకాలకు అసూయ అనేదే ఉండదు. శునకాలకు అసూయ లేదా చెడు అంటే ఏమిటో తెలియదు. కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. వాటికి స్నేహపూర్వకంగా ఉండటమే తెలుసు. కానీ ప్రస్తుతం చాలా మందికి తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ఏ స్వలాభం లేకుండా ప్రేమించటానికి చాలా బిజీగా ఉన్నారు.

శునకాల్లో రకాలు..

సమోయిడ్ కుక్క: చాలా ఖరీదైనది. సైబీరియా బ్రీడ్. 12 నుంచి 13 ఏళ్లు బతుకుతుంది. మగ కుక్కలు 20-29 కేజీలుంటాయి. ఆడవి 15-22 కిలోల వరకు ఉంటాయి. ఈ కుక్క రేటు రూ.10లక్షలు. అందుకే ఆస్తులు అమ్ముకోవాలన్నది.

లాంచెన్ శునకాలు: ఇవి అరుదైన కుక్కలు. 1973 నుంచి 65 మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

టిబెటన్ మస్తిఫ్: ఈ శునకం పేరులోనే టిబెట్‌ ఉండటానికి కారణం ఈ కుక్కలు టిబెట్‌లోనే కనిపిస్తాయి. ఇవి 2 అడుగుల ఎత్తు పెరగగలవు. 50 నుంచి 90 కేజీల బరువు బరువు వరకు ఉంటాయి. 14 ఏళ్లపాటూ జీవించగలవు. వీటి జుట్టు వీటి కళ్లను మూసేస్తూ ఉంటుంది.

అజవాక్‌ శునకాలు: ఈ కుక్కలు పశ్చిమ ఆఫ్రికా, ఇంగ్లండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కూడా 10 నుంచి 12 సంవత్సరాల వరకు బతుకుతాయి. బరువు మాత్రం 15 నుంచి 25 కిలోల వరకు పెరుగుతాయి. వీటికి పొడవు కాళ్లు ఉండటం వల్ల ఇవి అత్యంత వేగంగా పరుగెత్తగలవు.

రొట్‌వెయిలెర్ డాగ్‌: ఇది జర్మనీ బ్రీడ్. సామాన్లు తీసుకెళ్లే కార్ట్స్ లాగేందుకు వీటిని వాడుతున్నారు. ఇవి 8 నుంచి 10 ఏళ్లు బతకగలవు. బరువు 60 వరకు ఉంటాయి.

ఫారో హౌండ్: యూరప్ జాతీయ కుక్క మాల్టా. ఈ జాతికి చెందినదే. దీన్ని రాబిట్ కాట్ వు డాగ్ అంటారు. క్వారీల్లో ఎక్కువగా వాడే ఈ కుక్క… కుందేలు కంటే వేగంగా పరుగెత్తగలదు. అందుకే కుందేళ్లను వదిలి.. ఈ కుక్కల్ని వదులుతారు. ఆ వేటను చూసి ఎంజాయ్ చేస్తారు.

ఆప్ఘాన్ హౌండ్: ఇవి పేరుకు తగ్గట్టు ఆప్ఘనిస్థాన్‌లో కనిపిస్తాయి. ఈ కుక్క జుట్టు 69 సెంటీమీటర్ల దాకా పెరగగలదు. ఇవి 23 నుంచి 27 కిలోల బరువు ఉంటాయి.

ఇవీ కూడా చదవండి:

Aadhaar Card: ఆధార్ కార్డులో పేరుతో పాటు ఇతర వివరాలు మార్చుకోవాలా..? ఈ డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించవచ్చు..!

Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. వెంటనే నయమవుతుంది..!