Russia Ukraine Crisis: ప్రభుత్వ ప్రకటనను తుంగలో తొక్కిన పోలాండ్‌ పోలీసులు.. విద్యార్థులపై ఓవరాక్షన్‌

|

Feb 27, 2022 | 8:40 PM

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తెగబడుతోంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఉక్రెయిన్‌ (Ukraine)లోభారీగా..

Russia Ukraine Crisis: ప్రభుత్వ ప్రకటనను తుంగలో తొక్కిన పోలాండ్‌ పోలీసులు.. విద్యార్థులపై ఓవరాక్షన్‌
Follow us on

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తెగబడుతోంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఉక్రెయిన్‌ (Ukraine)లోభారీగా భారతీయులు చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్రం (Central) చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అక్కడి నుంచి భారతీయులు విమానాల్లో తరలి వస్తున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 15 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.

రష్యా దాడుల నేపథ్యంలో పశ్చిమ ప్రాంతంలో దాడులు తక్కువగా ఉన్నందున పశ్చిమ ప్రాంతాలకు రావాలంటూ ఉక్రెయిన్‌లోని భారతీయులకు కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో భారతీయుల తరలింపుపై విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు 4వేల మంది వరకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో 15వేల మందిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలోనే 2వేల మంది భారతీయులున్నారు. భారతీయుల తరలింపు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు.

పోలాండ్‌ బార్డర్‌లో పోలీసుల ఓవరాక్షన్‌:

పోలాండ్‌ బార్డర్‌లో పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. భారతీయ విద్యార్థులకుపై పోలీసులు దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులను బూటుకాళ్లతో పోలీసులు తన్నుతుండటంతో భారతీయ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చెక్‌ పోస్టుల్లో రద్దీకి పోలీసులు చేతులెత్తేశారు. అయితే వీసా లేకపోయినా రావొచ్చని కొద్దిసేపటి క్రితమే పోలాండ్‌ ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రకటనను పోలీసులు తుంగలో తొక్కుతున్నారు. విద్యార్థులపై పోలీసులు విచక్షణారితంగా దాడులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై శరణార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హంగేరి విదేశాంగశాఖతో  మంత్రి జైశంకర్‌ ఫోన్‌లో మాట్లాడారు. భారతీయ విద్యార్థులను తరలించేందుకు సహకరించాలని కోరారు.

ఈ మేరకు కేరళకు చెందిన ఏంజెల్‌ అనే విద్యార్థిని అక్కడి పో లీసుల తీరుపై వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలాండ్‌ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి:

Russias Military: రష్యా సైనికుల వాహనాలపై జెడ్‌ (Z) అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

Russia-Ukraine war: పెంపుడు కుక్కను విడిచిపెట్టి నేను రాలేను.. మాకు సాయం చేయండి.. భారత విద్యార్థి వేడుకోలు..