Indian Navy: భారత్-ఖతార్ మధ్య దౌత్యం సఫలం.. ఉరిశిక్షను రద్దు చేస్తూ కీలక ప్రకటన..

భారత్-ఖతార్‌ మధ్య దౌత్యం విజయం సాధించింది. గతేడాది మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్‌ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా ఉరిశిక్షను రద్దు చేసి జైలు శిక్షగా మార్చారు. ఖతార్‎లో బందీలైన నావికాదళ అధికారులను విడిపించాలని నౌకాదళ కుటుంబసభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరారు.

Indian Navy: భారత్-ఖతార్ మధ్య దౌత్యం సఫలం.. ఉరిశిక్షను రద్దు చేస్తూ కీలక ప్రకటన..
Pm Modi
Follow us

|

Updated on: Feb 12, 2024 | 9:26 AM

భారత్-ఖతార్‌ మధ్య దౌత్యం విజయం సాధించింది. గతేడాది మరణశిక్షకు గురైన ఎనిమిది మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్‌ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా ఉరిశిక్షను రద్దు చేసి జైలు శిక్షగా మార్చారు. ఖతార్‎లో బందీలైన నావికాదళ అధికారులను విడిపించాలని నౌకాదళ కుటుంబసభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరారు. వీరి అభ్యర్థనపై ఖతార్ తో సంప్రదింపులు జరిపింది భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ. తమ దేశం నుంచి బందీలైన వారిని విడిచిపెట్టి, సురక్షితంగా స్వదేశానికి తిరిగి పంపించాలని కోరింది.

ఇదిలా ఉంటే నౌకాదళ సిబ్బందిని స్వదేశానికి తీసుకురావడానికి చట్టపరమైన సహాయం ఏర్పాటు చేస్తామని వారి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చింది భారత్. ఎనిమిది మంది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారం అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖతార్‌లో నిర్బంధించబడిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. మొత్తం ఎనిమిది మందిలో ఏడుగురు భారతదేశానికి తిరిగి వచ్చారు. బందీగా ఉన్న భారతీయులను విడుదల చేసి స్వదేశానికి పంపించడానికి వీలుగా ఖతార్ రాష్ట్ర అమీర్ తీసుకున్న నిర్ణయాన్ని, ఏర్పాట్లను తాము అభినందిస్తున్నామని తెలిపింది భారత విదేశాంగశాఖ.

ఇవి కూడా చదవండి

ఎనిమిది మంది భారతీయ పౌరులు అక్టోబర్ 2022 నుండి ఖతార్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జలాంతర్గత వ్యవహారాల్లో గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రిటైర్డ్ నావికా సిబ్బందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే దీనిని అధికారికంగా ప్రకటించలేదు.ఇదిలా ఉంటే ఖతార్‌లోని న్యాయ బృందంతో సన్నిహితంగా ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దుబాయ్‌లో COP28 శిఖరాగ్ర సమావేశానికి హాజర్యారు. ఈ సందర్భంగా ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని కలుసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యం పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదే క్రమంలో ఖతార్‌లో నివసిస్తున్న భారతీయుల శ్రేయస్సు గురించి ఆ దేశ రాజుతో చర్చించారు ప్రధాని మోదీ.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..