AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India attacks Pakistan: పాకిస్తాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసిన

భారత్-పాక్ మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. భారత్‌పై 15 చోట్ల డ్రోన్లు, మిస్సైళ్లతో పాక్ దాడులకు యత్నించింది. పాక్‌ ప్రయోగాలను గగనతలంలోనే తిప్పికొట్టింది భారత్. తిరిగి పాక్‌లోని అనేక ప్రాంతాలపై దాడులు చేసిన భారత్.. లాహోర్‌లోని ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసింది.

India attacks Pakistan:  పాకిస్తాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసిన
India Vs Pakistan
Ram Naramaneni
|

Updated on: May 08, 2025 | 3:44 PM

Share

జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం రాత్రి పాకిస్తాన్ మిస్సైళ్లను ప్రయోగించింది. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాక్.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అయితే ఇంటిగ్రేటెడ్‌ యూఏఎస్‌ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలతో పాక్‌ ప్రయోగాలను గగనతలంలోనే భారత్ తిప్పికొట్టింది. భారత్‌లోని శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్‌, అవంతిపుర, అమృత్‌సర్‌, అదామ్‌పుర్‌, కపుర్తలా, జలంధర్‌, భఠిండా, చండీగఢ్‌, నాల్‌, ఫలోడి, భుజ్‌ తదితర ప్రాంతాల్లోని ఆర్మీ క్యాంపులు లక్ష్యంగా చేసుకునేందుకు పాక్ యత్నించిందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

పాక్ చర్యలతో భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. తిరిగి పాక్‌లోని అనేక ప్రాంతాలపై దాడులు చేసింది భారత్. దాడులు, ప్రతిదాడుల విషయాన్ని భారత్ ధృవీకరించింది. పాకిస్తాన్ క్షిపణి రక్షణ వ్యవస్థపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. లాహోర్‌లోని ఎయిర్‌డిఫెన్స్‌ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసినట్లు భారత్‌ ప్రకటించింది. దాడులకు తెగబడుతున్న పాక్‌కు బుద్ధి చెబుతామని భారత్ మరోసారి హెచ్చరించింది.

మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాక్ భారీ ఫిరంగులతో దాడులను కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..