Russia Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా తొలిసారి ఓటేసిన భారత్‌.. చైనా మాత్రం దూరంగానే..

|

Aug 26, 2022 | 9:37 AM

మరోవైపు ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రష్యా తీవ్రమైన దాడికి పాల్పడింది. తూర్పు ఉక్రెయిన్‌ పట్టణం చాప్లిన్‌లోని రైల్వే స్టేషన్‌ మీద రష్యా రాకెట్‌ దాడి జరిపింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Russia Ukraine War: రష్యాకు వ్యతిరేకంగా తొలిసారి ఓటేసిన భారత్‌.. చైనా మాత్రం దూరంగానే..
Russia Ukraine War
Follow us on

Russia Ukraine War: ఉక్రెయిన్‌ మీద దాడి వ్యవహారంలో ఇప్పటి వరకూ రష్యాకు వ్యతిరేకంగా ఓటుకు దూరంగా ఉంటూ వచ్చిన భారత్‌.. తొలిసారిగా ఇందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించడానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేయగా.. చైనా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది.. రష్యా జెలెన్‌ష్కీ ప్రసంగాన్ని వ్యతిరేకించింది. మరోవైపు ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రష్యా తీవ్రమైన దాడికి పాల్పడింది. తూర్పు ఉక్రెయిన్‌ పట్టణం చాప్లిన్‌లోని రైల్వే స్టేషన్‌ మీద రష్యా రాకెట్‌ దాడి జరిపింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదుగురు సజీవంగా దహనమయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు బాలురు కూడా ఉన్నారు.

ఈ దాడిని యూరోపియన్‌ యూనియన్‌ ఖండింది. ఇందుకు రష్యాను బాధ్యురాలిని చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే తాము ఉక్రెయిన్‌ దళాల మీద దాడి చేశామని రష్యా సమర్థించుకుంది. తాము ఉక్రెయిన్‌ దళాలపై దాడులు చేసినట్లు రష్యా రక్షణశాఖ తెలిపింది. తమ ఇస్కందర్‌ మిసైల్‌ అటాక్‌లో 200 మంది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయినట్లు చెప్పుకుంది.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశానికి సంఘీభావంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రదర్శనలు జరిగాయి. రష్యా దాడులను ఆపాలని, ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు.