Morgan Doyne: మోడలింగ్ ఫోటోలు అమ్ముకుంటూ.. కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎవరామె..? ఏంటా కథ?
Morgan Doyne: డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ క్రమంలో రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. విదేశాల్లో ముఖ్యంగా..
Morgan Doyne: డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ క్రమంలో రకరకాల మార్గాలు ఎంచుకుంటారు. విదేశాల్లో ముఖ్యంగా యూరప్ దేశాల్లో(European Countries) అయితే చాలా మంది రకరకాల కెరీర్‌లు ఆలోచించుకొని.. చివరకు మోడల్స్ (models) గా మారుతున్నారు. కొంతమంది ఆల్రెడీ చేస్తున్న కెరీర్‌లు వదిలేసి…తమ ఫోటోలను తామే అమ్ముకునే డిఫరెంట్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నారు. ఇందుకు కారణం ఈ మార్గంలో భారీగా వస్తున్న సంపాదనే ఓ కారణం అనుకోవచ్చు. మోర్గాన్ డోయ్న్ కూడా అలాంటి అమ్మాయే.
డైలీ స్టార్ ప్రకారం… మోర్గాన్‌కి సైన్స్ అంటే ఇష్టమట. యూనివర్శిటీలో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ చదివిన ఈమెకు పోలీస్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అవ్వాలన్నది డ్రీమ్. ఓవైపు చదువుకుంటూ… మరోవైపు వెయిట్రెస్‌గా పనిచేస్తూ… డబ్బు సంపాదించేది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండేళ్లు గడిచేసరికి ఆమెకు ఇప్పుడు ఐదు బెడ్‌రూమ్‌ల సొంత ఇల్లు, 74 లక్షల ఖరీదైన ఫ్లాషీ రెడ్ మస్తాంగ్ కారు సంపాదించుకుంది. ఈ డబ్బంతా ఆమెకు పోలీస్ అవ్వడం వల్ల రాలేదు. తన బెడ్‌రూంలో తీసిన పర్సనల్ ఫొటోలు అమ్ముకోవడం ద్వారా వచ్చింది.
ప్రపంచ దేశాల్ని కరోనా పట్టుకున్న తొలి రోజుల్లో ఓన్లీఫాన్స్‌లో చేరిన మోర్గాన్… వారం వారం తన సంపాదనను పెంచుకుంటూ పోయింది. ఇప్పుడామె నెలకు రూ.40 లక్షల దాకా సంపాదిస్తోంది. సాధారణంగా ఇలాంటి సైట్స్ లో చేరిన వారు వీలైనంత ఎక్కువగా స్కిన్ షో చేస్తే డబ్బు వస్తుంది అనుకుంటారు. కానీ మోర్గాన్ మరోలా ఆలోచించింది. కాస్‌ప్లేయర్లు వేసుకునే డ్రెస్సులతో ఫొటోలు దిగి… వాటిని అమ్ముకోవాలి అనుకుంది. అది ఆమెకు కలిసొచ్చింది. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు, యానిమేషన్ కార్టూన్లలో కేరక్టర్లు వేసుకునే కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ ఫొటోలను ఓన్లీఫాన్స్‌లో పోస్ట్ చేస్తోంది మోర్గాన్.
25 ఏళ్ల ఈ బ్యూటీ.. ఓన్లీఫాన్స్ తన జీవితాన్ని మార్చేసిందని, తనకు ఈ కెరీర్ బాగుందని అంటోంది. మోర్గాన్ లాంటి ఎంతో మంది కెరీర్‌లో ఏదో సాధించాలి అని కలలు కంటూ. చివరకు ఇలాంటి మోడల్స్‌గా మారిపోతున్నారు. విపరీతంగా వస్తున్న డబ్బు వారిని ఇది తప్ప మరొకటి ఆలోచించనివ్వకుండా చేస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.