Plane Crash: ఢీకొన్న వాయుసేన విమానాలు.. ముగ్గురు మృతి

Plane Crash: రెండు వాయుసేన విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు(Dead). ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Plane Crash: ఢీకొన్న వాయుసేన విమానాలు.. ముగ్గురు మృతి
Plane Crash
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 01, 2022 | 1:44 PM

Plane Crash: రెండు వాయుసేన విమానాలు ఢీకొన్న ఘటన సౌత్ కొరియాలో(South Korea) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు(Dead). ఒకరికి తీవ్ర గాయాలు కావటంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన తర్వాత సచియాన్​ నగరానికి సమీపంలోని లోయ ప్రాంతంలో ఈ విమానాలు కూలినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలతో పాటు కొంతమంది సిబ్బందిని అధికారులు ప్రమాద స్థలానికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల ఘటనాస్థలం వద్ద ఎవరైనా స్థానికులు ప్రాణాలు కోల్పోయారా అనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు.

KT-1 మోడల్​కు చెందిన ఈ విమానాలను శిక్షణ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. శిక్షణా సమయంలో గాల్లో చెక్కర్లు కొడుతున్న సమయంలో ప్రమాదం సంభవించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ మోడల్ విమానాల్లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. అసలు ప్రమాదానికి కారణం ఏమిటి అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ తరుణంలో ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు వాయుసేన తన దర్యాప్తును కొనసాగిస్తోంది. దీని వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయా లేక ఇతర కారణాల వల్ల ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ప్రమాదానికి ముందు జనవరిలో కూడా దక్షిణ కొరియా వాయుసేనకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. గతంలో F​-5E రకానికి చెందిన విమానం కొండను ఢీకొనడం వల్ల పైలట్​ ప్రాణాలు కోల్పోయాడు. వరుస ప్రమాదాలను సీరియస్ గా తీసుకున్న సౌత్ కొరియన్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి..

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..

Mahindra: నూతన సాంకేతికతలోకి అడుగుపెట్టిన మహీంద్రా గ్రూప్.. ఆనంద్ మహీంద్రా ప్రకటన..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!