డొరైన్ బీభత్సం…బహమాస్ అతలాకుతలం… ఏడుగురు మృతి!
కరీబియన్ దేశం బహమాస్‌లో డోరైన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తుపాను వల్ల ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. గంటకు 297 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ప్రభావానికి ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అబాకో ద్వీపంలో వరదలకు తాగు నీరు కలుషితమైంది. విపత్తు తీవ్రత […]

కరీబియన్ దేశం బహమాస్‌లో డోరైన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తుపాను వల్ల ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. గంటకు 297 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తుపాను ప్రభావానికి ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అబాకో ద్వీపంలో వరదలకు తాగు నీరు కలుషితమైంది. విపత్తు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరదల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను నుంచి రక్షించమని ఓ రేడియో స్టేషన్‌కు 2వేల సందేశాలు అందాయి. డోరైన్ తుపాను నేపథ్యంలో ప్రజలు తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు సహాయక చర్యలు చేపట్టలేమని స్పష్టం చేశారు. మరోవైపు డోరైన్ తుపాను మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడా తీరప్రాంతంవైపు ప్రయాణించే అవకాశముంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.