Indonesia: వారంలో 500మంది చిన్నారుల బలి.. 50వేల కొత్త కేసులు.. ఇండోనేసియాలో డెల్టా డెత్ గేమ్..

|

Jul 26, 2021 | 11:21 AM

గత వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. మొత్తంమీద..

Indonesia: వారంలో 500మంది చిన్నారుల బలి.. 50వేల కొత్త కేసులు.. ఇండోనేసియాలో డెల్టా డెత్ గేమ్..
Indonesia Children Covid
Follow us on

ఆ దేశం.. ఏషియాలోనే డెల్టా వేరియంట్ కే కేంద్రబిందువుగా మారిందా? నానాటికీ పెరుగుతున్న కేసులు, చావుల తో బెంబేలెత్తిపోతోందా? ఇండోనేసియాలో కోవిడ్ పేనిక్ సిట్యువేషన్ ఎలా ఉంది? డెల్టా వేరియంట్ లో- ఇప్పటి వరకూ 27 లక్షల కేసులు- ఒక్క వారంలో 50 వేల కేసులు.. తన రికార్డులను తానే అధిగమిస్తూ తన చావు తానే ఒంటరిగా ఎదుర్కుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండోనేసియా. ఇక్కడ చాలా మంది పరిస్థితి ఏంటంటే.. ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి డెల్టా డెత్ సమాచారం అందుకుంటున్న సిబ్బంది గతంలో ఒకటీ రెండు మాత్రమే దహన సంస్కారాలను చేసేవారు. అదే ఇప్పుడు.. రోజుకు 24 వరకూ అంత్యక్రియలు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.

ఆక్సిజన్ కొరత, కోవిడ్ మరణాలు, ప్రాణాధార ఔషధాల లభ్యత లేకపోవడంతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి చాలావరకు భారత్ గట్టెక్కినట్టే అని చెప్పాలి. అయితే అప్పటి భారత్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు ఇండోనేషియాలో కనిపిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అయితే ఇందులో ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పుడు ఇది కాస్తా.. పెరిగి పెద్దవారి నుంచి చిన్నారలను తాకింది. చిన్నారుల ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కోవిడ్  బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండోనేషియాకు చెందిన వందలాది మంది చిన్నారులు  కోవిడ్ మహమ్మారికి చిక్కి చనిపోయారు. వారిలో చాలా మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇండోనేషియాలో పిల్లల్లో కోవిడ్ మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా నమోదైంది.

జూలై నెలలో వారానికి 100 కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇండోనేషియాలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో ఇదే ఎక్కువ అని అక్కడి అధికారులు అంటున్నారు. పిల్లల మరణాల సంఖ్య పెరుగుదల ఆగ్నేయాసియాలో డెల్టా వేరియంట్ కేసులతో సమానంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇండోనేషియా ప్రభుత్వం దేశీయ మొత్తం జనాభాలో దాదాపు 50వేల కొత్త కేసులు నమోదు కాగా.. 1,566 మరణాలు నమోదయ్యాయి.

శిశువైద్యుల ఇచ్చిన నివేదికల ప్రకారం.. ఆ దేశంలో కోవిడ్ కేసులలో మునుపటి నెలతో పోలిస్తే… చిన్నారులు 12.5శాతంగా ​ఉన్నారు. జూలై 12న కరోనాతో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు.  గత వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. మొత్తంమీద.. ఇండోనేషియాలో 3 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా, 83వేల మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి ఇండోనేషియాలో 18ఏళ్ల కంటే తక్కువ వయస్సులో 800 మందికి పైగా చిన్నారులు కరోనా రక్కసికి చిక్కారు.

కోవిడ్ మరణాలలో ఎక్కువ భాగం గత నెలలోనే నమోదయ్యాయని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశంలో తక్కువ టీకా రేటు కూడా దీనికి కారణమనేది ఇక్కడి వారి రిపోర్టులో వెల్లడైంది. ఇండోనేషియాలో కేవలం 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందినట్లుగా తెలుస్తోంది. మరో 6శాతం మందికి మాత్రమే రెండో డోస్ వేయించుకున్నవారి సంఖ్య ఉంది.

కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సోకిన చిన్నారుల సంరక్షణ కోసం కొన్ని ఆస్పత్రులను ప్రత్యేకంగా  ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిలలను రక్షించుకునేందుకు వారి ఉరుకులు పరుగులు చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తోంది.

భారత్ సహాయం..

భారత్ తన మిత్ర దేశానికి చేయూతనిస్తోంది. ఇప్పటికే 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు పంపించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు.

ఇవి కూడా చదవండి: Ramappa Temple: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..