ప్లేట్‌లో రోటీ లేదు.. అణు బాంబు వేస్తామని బెదిరిస్తున్నారు.. పాక్‌లో కిలో పిండి ధర ఎంత?
పహల్గామ్ దాడి తర్వాత, 1960లో సంతకం చేసిన సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. దీని కారణంగా పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని భారత్ నిలిపివేసింది. పాకిస్తాన్ వ్యవసాయంలో 80 శాతం సింధు నది నీటితోనే సాగు చేయడం జరుగుతుంది .అటువంటి పరిస్థితిలో, ఈ నీరు ఎక్కువ కాలం నిలిచి ఉంటే, పాకిస్తాన్‌లో కరువు పరిస్థితి తలెత్తవచ్చంటున్నారు నిపుణులు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్తాన్‌పై చర్య తీసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాలకు స్వేచ్ఛా హస్తం ఇచ్చారు. ఆ తర్వాత భారత సైన్యం యుద్ధానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సన్నాహాలలో భాగంగా, యుద్ధం జరిగితే తమను తాము రక్షించుకోవడానికి, మే 7వ తేదీన దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతీకార చర్యకు భారత సైన్యం సిద్ధమవుతున్న తీరు చూసి, పాకిస్తాన్ నాయకులు, సైన్యం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి స్థానిక ప్రజలకు వారి ప్రభుత్వంపై నమ్మకమే పోయింది. అయినప్పటికీ పాకిస్తాన్ నుండి పదే పదే అణు దాడి బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపు వెనుక చాలా కారణాలు ఉన్నాయి, ప్రధాన కారణాలలో ఒకటి పాకిస్తాన్‌కు వెళ్లే సింధు నది నీటిని భారత్ నిలిపివేసింది. రెండవ కారణం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి యుద్ధం చేయడానికి సరిపోకపోవడం. పాకిస్తాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతోంది.
భారతదేశంలో గోధుమ పిండి ధర సాధారణంగా రూ.40 నుండి ప్రారంభమై రూ.60-65 వరకు ఉంటుంది. దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గోధుమ పిండి ధర ఆకాశాన్నంటుతోంది. పాకిస్తాన్ ఆన్‌లైన్ డెలివరీ కిరాణా యాప్‌లో శోధించినప్పుడు, భారతదేశానికి ఆనుకుని ఉన్న పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో 5 కిలోల పిండి ధర రూ. 615. అంటే కిలో గోధుమ పిండి ధర అక్షరాల రూ.123.
పహల్గామ్ దాడి తర్వాత, 1960లో సంతకం చేసిన సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. దీని కారణంగా పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని భారతదేశం నిలిపివేసింది. పాకిస్తాన్ వ్యవసాయంలో 80 శాతం సింధు నది నీటితోనే సాగు చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఈ నీరు ఎక్కువ కాలం నిలిచి ఉంటే, పాకిస్తాన్‌లో కరువు పరిస్థితి తలెత్తవచ్చు. పాకిస్తాన్‌లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




