AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధమేఘాలు.. నిప్పుల వాన సంకేతాలు..! పప్పు ఉప్పు సహా అన్ని ధరలు పెరుగుతాయా?

దేశంలో ఏ నలుగురు కలిసినా ఒకటే చర్చ. యుద్ధం వస్తుందా రాదా. అందరిలోనూ ఇదే ఉత్కంఠ. పాకిస్తాన్‌కు కచ్చితంగా గట్టి బుద్ధి చెప్పాలనే కసి. బాగానే ఉంది. ఆల్రడీ.. ఇండియా కూడా ప్రిపేర్‌ అవుతోంది. జనాన్ని ప్రిపేర్‌ చేస్తోంది. బట్.. కొన్ని నిజాలు కూడా మాట్లాడుకోవాలి. చేసేది వాళ్లు కాదు కాబట్టి.. యుద్ధం భలే సరదా ఆ కొందరికి. యుద్ధ బాధితుల్లో తమవాళ్లు లేకపోతే.. యుద్ధ వార్తలు భలే కాలక్షేపం చాలామందికి..!

యుద్ధమేఘాలు.. నిప్పుల వాన సంకేతాలు..! పప్పు ఉప్పు సహా అన్ని ధరలు పెరుగుతాయా?
India Pakistan Conflicts
Balaraju Goud
|

Updated on: May 06, 2025 | 9:55 PM

Share

బార్డర్‌లో బాంబులు పేల్చుకుంటే.. తమకేమవుతుందిలే అనుకుంటారు చాలామంది. బట్.. ఒక యుద్ధం ఆ దేశ కుగ్రామంలోని ప్రజలపైనా ప్రభావం చూపిస్తుంది. తెలుసా..! గత పాతికేళ్లుగా భారత్ యుద్ధం చేయలేదు కాబట్టి ఆ విషయం మరిచిపోయి ఉంటారు. బట్.. కార్గిల్‌ యుద్ధం నాటి పరిస్థితులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలిక్కడ. 1971లో యుద్ధం జరిగినప్పటి పరిస్థితులను కూడా మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఇకపై రాబోయే యుద్ధం, ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ ఓ అవగాహన వస్తుంది. ఆ అవగాహనకే ఈ స్టోరీ. యుద్ధం యుద్ధం అని తెగ కోరుకుంటున్నారు కొందరు. కాని, యుద్ధం ఆషామాషీ వ్యవహారమేం కాదు. యుద్ధం అంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాల్సిన ఓ అంతిమ పరిష్కారం. పైగా యుద్ధం ఊహకందని ఓ ఆర్థిక భారం కూడా. ఈ సందర్భంగా 1990 నాటి ఓ ఇంట్రస్టింగ్‌ మ్యాటర్‌ చెప్పుకోవాలి. CIA- సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అని ఒకటుంది. అమెరికాకు చెందిన నిఘా సంస్థ ఇది. ప్రపంచ దేశాల్లో ఎక్కడేం జరుగుతోందన్న దానిపై ఓ కన్నేసి ఉంచడం ఈ సీఐఏ మెయిన్‌ డ్యూటీ. ఆ సీఐఏ.. 1990లో ఓ రిపోర్ట్‌ తయారు చేసి అమెరికా ఉన్నతాధికారులకు పంపింది. ఆ నివేదికలో.. పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం చేయాలనుకుంటోంది అని రాసుకుంది. సుమారు వెయ్యి గంటల పాటు యుద్ధం చేయాల్సి వస్తే.. అంటే 41 రోజుల పాటు యుద్ధం చేస్తే.. ఎంత ఖర్చు అవుతుందనేది లెక్కలేసి పెట్టుకుంది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి