Japan Floods: ఓ వైపు జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు జపాన్ లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతకుతలమవుతుంది. నాలుగు రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా టోక్యోకు నైరుతి అటామీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. మరో 27మంది గల్లంతయ్యారని అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్పారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు జలమయం అయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచింది.. ముఖ్యంగా దక్షిణ జపాన్‌లోని 1.20 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
క్యుషు దీపంలోని మూడు ప్రిఫెక్చర్లలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని స్థానిక అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: