Haiti president jovenel moise : హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిజ్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను ఆయన ఇంట్లోనే హతమార్చారు. ఈ ఘటనతో ఆయన భార్య మార్టిన్ మొయిజ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్టు తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ తెలిపారు. ఈ హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇది పిరికిపందల హేయమైన చర్య అని పేర్కొన్నారు. అయితే పోలీసులు, సైనికులు పరిస్థితిని అదుపులోనే ఉంచినట్టు వెల్లడించారు. ఇప్పటికే హైతీలో గ్యాంగ్ వయొలెన్స్, హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. రాజకీయ, ఆర్ధిక అస్థిరత కొనసాగుతున్నాయి. కెనడా లోని హైతీ ఎంబసీ మొయిజ్ హత్యను నిర్ధారించింది. కొన్నేళ్లుగా ఈ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఆహార కొరత తీవ్రంగా ఉంది. ప్రజలు రోజుకు 2 డాలర్లను మించి సంపాదించలేకపోతున్నారు. పైగా 2010 లో వచ్చిన పెను భూకంపం, 2016 లో హరికేన్ (తుపాను) వల్ల హైతీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికీ ఆ నష్టాల బారి నుంచి బయట పడలేకపోతోంది . ఎన్నికలు లేవు..పార్లమెంటును రద్దు చేశారు.
నిజానికి హైతీ అధ్యక్షుని పదవీ కాలం గత ఫిబ్రవరితోనే ముగిసిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెండేళ్లుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నా ఏ నాడూ దేశ సమస్యలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆయన రాజీనామా చేయాల్సిందేనని వీరు డిమాండ్ చేస్తున్న వేళ ఈ హత్య జరిగింది. బహుశా కుట్ర జరిపి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరి కొద్దీ నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ సందర్భంగా హింస మరింత పెరగవచ్చునన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ముఖ్యమంత్రి పై షాకింగ్ కామెంట్స్..(వీడియో):actor kasturi shankar video.